జగన్ చేసే మేలు ఉల్లి చెయ్యదంటూ పవన్ సెటైర్లు

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారన్నది లోకోక్తి.. కానీ ఏపి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదంటూ తనదైన శైలిలో విమర్శల ట్వీట్లని కురిపించారు జనసేన అధినేత పవన్.
సాధారణ ప్రజల నిత్యవాడుకలో భాగమైన ఉల్లి ఇప్పుడు తరగకుండానే కంటనీరు పెట్టిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే ధరలు ఇంత ఎక్కువగా పెరిగి పోతున్న పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. ఉల్లి కోసం ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, సర్కారు సబ్సిడీలో ఇస్తామంటూ సవాలక్ష నిబంధనలు పెడుతోందని దీంతో జనాలు బెంబేలెత్తుతున్నరని ఆవేదన వ్యక్తం చేసారు పవన్. ధరలు పెంచితే సామాన్యుడు ఉల్లికి దూరం కావాలన్న లక్ష్యంతోనే జగన్ సర్కారు భారీగా ధరల పెంపుకు కారణమవుతోందంటూ విమర్శించారు.
పెరిగిన ఉల్లి ధరలతో రైతులు, వినియోగదారులు నష్టపోతున్నారని, వ్యాపారుల కన్నా మధ్య దళారులకే కాసుల వర్షం కురిపిస్తుండటంతో వారంతా లాభపడుతున్నారని… అన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో వైసిపి సర్కారు పూర్తిగా విఫలమైందంటూ రైతు బజార్ల వద్ద ఉల్లి కోసం ప్రజలు బారులు తీరిన ఫొటోను ట్వీట్ చేసారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యానికి ఇదే తార్కాణం అని వ్యాఖ్య దాని కింద ఉంచారు పవన్ కళ్యాణ్.