‘వాటే వాటే వాటే బ్యూటీ’ పాట విడుదల

 ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’.  నితిన్, రష్మిక మందన, వెంకీ కుడుముల కాంబినేషన్ లోవ‌స్తున్న ఈ చిత్రం నుంచి   మరో పాట‌ని ఆదివారం    ‘యు ట్యూబ్’ ద్వారా విడుదల చేసారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలూ సమకూర్చగా, గాయకుడు ధనుంజయ్, గాయని అమల చేబోలు ల గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట. ‘వాటే వాటే వాటే బ్యూటీ’ పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది.
 ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ప్రతి అబ్బాయి నితిన్ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా రూపొందించామ‌ని,   ‘భీష్మ’ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయని చెప్పారు. భీష్మ ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభిస్తోందని,  ‘వాటే బ్యూటీ’ పేరుతో విడుదలైన ఈ గీతానికి కొన్ని నిమిషాల‌లోనే  అద్భుతమైన స్పందన లభించ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు. ఇప్ప‌టికే నిర్మాణ అనంత‌రం కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 21 న విడుదల కానుంద‌ని  చెప్పారాయ‌న‌.

Leave a Reply

Your email address will not be published.