శభాష్ పోలీస్.. సెల్యూట్ టు సజ్జనార్..

జయహో పోలీస్.. జై జై పోలీస్..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో తెలంగాణ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. దిశను కిడ్నాప్ చేసిన చోటనే కేసును రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసుల నుండి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజల నుండి అభినందనలు అందుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి, వారి బృందానికి సెల్యూట్. నర హంతకులను ఎన్కౌంటర్ చేసిన పోలీసు అధికారులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం.
ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసు అధికారులకు, కేసును విచారిస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారి చిత్రపటాలకు ప్రజలు పాలతో అభిషేకం చేస్తూ శభాష్ పోలీస్ అంటున్నారు..
జయహో పోలీస్.. జై జై పోలీస్..

