భ‌క్తుల‌కు అందుతున్న‌ సేవ‌ల‌పై టిటిడి అద‌న‌పు ఈవో స‌మీక్ష‌

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నార్ధం  వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇత‌ర ప్రాంతాల్లో భ‌క్తుల సౌక‌ర్యాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ఉద్దేశించిన   పిలిగ్రిమ్ వెల్ఫేర్ ఫెసిలిటేష‌న్ స‌ర్వీస్‌(పిడ‌బ్ల్యుఎఫ్ఎస్‌)పై  టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.


తిరుమ‌ల లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో  జ‌రిగిన ఈ స‌మీక్షా కార్య‌క్ర‌మంలో  అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ  ఇప్ప‌టివ‌ర‌కు శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొంటున్నార‌ని,. టిటిడి రిటైర్డ్ ఉద్యోగులు సైతం శ్రీ‌వారి సేవ‌లో పాల్గొనేందుకు  ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నందున‌ వారి సేవ‌ల‌ను కూడా పిడ‌బ్ల్యుఎఫ్ఎస్ సేవ‌లో వినియోగించుకుంటుంద‌ని తెలిపారు.


ఈ సేవ‌ల‌న్నింటిని ఉచితంగానే చేయాల్సి ఉంటుంద‌ని, ఎలాంటి వేతనం చెల్లించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌తో పాటు శ్రీ‌వారి ఆల‌యం, ల‌డ్డూ కాంప్లెక్స్‌, రిసెప్ష‌న్ త‌దిత‌ర విభాగాల్లో రిటైర్డు ఉద్యోగుల‌ సేవ‌ల‌ను వినియోగించుకుంటామ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.