గోడ మీద వార్తలు
ఏమో సారూ – మనేపైతే గంగిరెద్దుల్లా ఒకదాని మీద మరోకటి రంగురంగుల బట్టలు కప్పుకునే అలవాటు లేదెవుడికీ – మరి మీరెవర్నుద్దేశించన్నారో ఏందో…??
02. జలుబుతో బాధపడుతున్న కవితక్కని పరామర్శించిన కేంద్ర మంత్రి – నిర్మలా సీతారామన్ …
అడ్డెడ్డే – జలుబు కూడా కేంద్ర మంత్రులు వచ్చి పరామర్శించేటంత పేద్ద జబ్బు అని ఇయాల్టి వరకూ తెలిదండీ బాబ…!!
03. వాలంటైన్స్ డే ని సోదరీమణుల దినోత్సవంగా జరుపుకోవాలని తెలిపిన – ఓ పాకిస్థాన్ ప్రొఫేసర్ …
మరేం – మా సెడ్డ గొప్పగా సెప్పేరు – దాన్దేటుంది మీరన్నట్టే ఫిబ్రోరి 14ని మీ సోదరీమణుల దినంగానే సేస్కుందాం…!!
04. చిన్న పరిశ్రమల కోసం – యువత కోసం ప్రారంభించిన ముద్ర బ్యాంకులో మొండి బకాయిలు తీవ్రంగా పెరుగుతున్నాయని తెలిపిన – ఆర్బీఐ …
వందో యాభయ్యో జేబులో పెడితే సంతకాలెట్టే ఫీల్డు వెరిఫికేషనాఫీసర్లుండగా – టార్గెట్ల కోసం కేవైసీ కూడా చూడని మేనేజర్లుండగా పెరక్క బ్రతుకుతాయా..??
05. కోడికత్తి కేసుని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంటే బాబు అభ్యంతరం చెప్పటం సరికాదు – ప్రస్తుత భాజపా నేత విష్ణుకుమార్రాజు …
దీన్నే నేలని పోయేదాన్ని నెత్తిన రాస్కోటం అంటార్లెండి – ఈ మధ్య మహత్తర సలహా ముండలి ఒకటి చేరినట్టుంది ఆయన చుట్టూ..!!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!