నత్వానీ నుంచి ఎంత బరువు అందుకున్నారు.?

పార్టీ విధానయక నిర్ణయాలలో తను కూడా ఒకడిగా నిలచిన వ్యక్తిని నేనని, అలాంటి నేను కన్నీళ్ల పర్యంతం అయినట్టు అధికార పార్టీ అనుబంధ ఛానళ్లలో ప్రసారం చేసాడంటూ ప్రచారం చేయటం పై భగ్గుమన్నారు తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ షెడ్యూలు కులాలను అవమానించారంటూ మంత్రులు సుచరిత, సురేష్‌లు తనపై వ్యాఖ్యలు చేయటాన్ని వర్ల తప్పుపట్టారు. పార్టీలో చంద్రబాబు తీసుకునే నిర్నయాలలో అనేక అంశాలనే ప్రస్థావించుకున్నా విషయం మీకు తెలియదేమో అని మండి పడ్డారు. దళితులకు రాజ్య సీటు ఇవ్వని సిఎం ఎవరైనా ఉంటే అది ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని ఎద్దేవా చేసారు.
ఏనాడైనా జగన్ మీతో పార్టీ విధాయక నిర్ణయాలతో పాలు పంచుకున్నారా? అని నిలదీసారు. ఓటమి, గెలుపా అన్నది కాదు… మీరు చేస్తున్న అకృత్యాలను ఎదుర్కొనేందుకే పార్టీ తరపున యుద్ధాన్ని చేస్తున్నానని, అన్నారు. వైసిపి గతంలో రెండు రాజ్యసభ సీట్లను ఒకే సామాజిక వర్గానికి కేటాయిస్తే మీరంతా ఎక్కడున్నారు ఈ మంత్రులు అని అన్నారు. చంద్రబాబు దళితులకు మొండి చెయ్యి చూపించాడంటూ చేస్తున్న వ్యాఖ్యలు తమ జగన్‌కే చెందుతుందని అన్నారు. ఎవరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే మీకేం తెలుసు. ఖాళీ అయిన నాలుగు సీట్లలో దళితులకు ఎన్ని సీట్లు ఇచ్చాడో జగన్ ని నిలదీయాలని మంత్రులకు సూచించారు.
నాడు తన తండ్రిని చంపించింది రిలయన్స్ అధినేత కారణం అని అన్న మీ అధ్యక్షుడు అంబానీని హత్తుకుని మరీ ఆతని అనుచరుడుకి రాజ్యసభ సీటు అందించడం వెనుక ఆంతర్యం ఏమిటో అడిగే సత్తా మీకుందా? అని మంత్రులని వర్ల ప్రశ్నించారు.
ఈ సీటు కోసం ఎంత మొత్తం కొట్టేసి దళిత బిడ్డలని అన్యాయం చేయటం కాదా? అని అడగగలరా? ఎంత బరువు అందుకున్నారని ప్రశ్నించగలరా? అని ప్రశ్నించారు వర్ల.