యాక్షన్ రివెంజ్ స్టార్ గా శ్రీ‌కాంత్‌


మెగాస్టార్ చిరంజీవి, నాగ‌బాబులు హీరోలుగా వ‌చ్చిన యండ‌మూరి న‌వ‌ల‌ ‘మరణమృదంగం” మంచి పేరు తెచ్చుకుంది. ఇదే టైటిల్‌లో ఇప్ప‌డు మధు రెబ్బ, చిరంజీవి వబ్బిలిశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం”మరణమృదంగం. లక్ష్మి రెడ్డి రెబ్బ సమర్పణలో మల్టీ కలర్ ఫ్రేమ్స్ బ్యానర్ పై వెంకటేష్ రెబ్బ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో ఫ్యామిలీ స్టార్ హీరో శ్రీకాంత్  న‌టిస్తున్నారు. ఈ చిత్రంతో మ‌రో మారు శ్రీ‌కాంత్‌ని యాక్షన్ రివెంజ్ స్టార్ గా మాచ్చే ప్ర‌య‌త్నం చేసే ప్ర‌య‌త్నం భుజాల మీద కెత్తుకున్నారు ద‌ర్శ‌కుడు  వెంకటేష్ రెబ్బ..

 ఈ చిత్రం 27-01-2020 సోమవారం ఉదయం ప్రసాద్ ల్యాబ్ లో జ‌రిగిన  పూజా కార్యక్రమాలతో  ఘనంగా ప్రారంభమైంది. తొలి షాట్‌కు దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. యంగ్‌, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్ ఇచ్చారు.    

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ… నావెంక‌టేష్ రెబ్బ మొద‌టిసారి క‌థ చెప్ప‌గానే నాకు బాగా న‌చ్చింది  ప‌క్కా ప్లానింగ్‌తో అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం షూటింగ్ పూర్తి చేసి విడుద‌ల చేస్తామ‌ని అన్నారు. అంత‌కు మించి చిత్ర టైటిల్ నాకెంత‌గానో న‌చ్చిన మ‌ర‌ణ మృదంగం కావ‌టం ఆనందంగా ఉంద‌ని అన్నారు.  

డైరెక్ట‌ర్ వెంక‌టేష్‌రెబ్బ మాట్లాడుతూ…చిన్న‌ప్ప‌టి నుంచి శ్రీ‌కాంత్‌గారి సినిమాలు చూస్తూ పెరిరిన నాకు ర‌చ‌యిత‌ తుల‌సీ దాస్ ఇచ్చిన క‌థ‌తో  ఆయ‌న‌ని డైరెక్ట్ చేసా  అదృష్టంగా ద‌క్కిందన్నారు.  

ప్రొడ్యూసర్ మ‌ధురెబ్బ‌ మాట్లాడుతూ –  వెంకటేష్ రెబ్బ,  కథ కథనం చెప్పిన విధానం నచ్చి శ్రీకాంత్ తో ఈ సినిమా చేసేందుకు సిద్ద‌మయ్యా.  “  తపనతో పాటు క్రియేటివ్ ఆలోచనలు టెక్నాలజీ పై అవగాహన ఉన్న మంచి ద‌ర్శ‌కుడు దొరికాదు.  తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.


Leave a Reply

Your email address will not be published.