తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో పవన్ పర్యటన

మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధాని విషయంపై పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఈ సమావేశంలో రాజధానిపై ముఖ్యమైన విషయాలను చర్చించామని చెప్పారు. ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా విమర్శించారు. రాజధాని విషయంలో అమరావతికి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. కొంతమంది నాయకులు ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. తలతోక లేని నిర్ణయాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
రాజధాని రైతులకు సంఘీభావ తెలిపేందుకు రేపు ఉదయం మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో పర్యటిస్తానన్నారు. అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై నాదెండ్ల మనోహర్, నాగబాబు పవన్‌కు 20 పేజీల నివేదిక అందజేశారు. ఈ నివేదికపై పార్టీ నేతలతో పవన్ చర్చించారు. జిల్లాల వారీగా ఆయా పరిస్థితులను అంచనా వేయాలన్నారు.పవన్ పర్యటన