సుకుమార్ సినిమా లో ‘రంగమత్త’ మళ్ళీ ఛాన్స్ కొట్టిందిగా

ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని వినవస్తోంది. చిత్తూరు జిల్లా ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా సుక్కు ఈ సినిమాను కథను రూపొందించడంతో పాటు నల్లమల్ల ఫారెస్ట్‌లో దీనిని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
గత ఏడాది `రంగస్థలం` వంటి బ్లాక్‌బస్టర్ హిట్ వచ్చాక పలువురు నిర్మాతలు తమ చిత్రాలు చేయమని అడిగినా డైరెక్టర్ సుకుమార్ బన్నీతో సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నానని తేల్చి చెప్పాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో `రంగస్థలం` చిత్రంలో రంగమత్త పాత్రలో నటించి అందరి ప్రశంసలందుకున్న యాంకర్ అనసూయ ను ఈ బన్నీ చిత్రం లో కూడా ఓ ప్రధాన భూమిక కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. ఫిబ్రవరి నుండి అనసూయ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటుందని తెలుస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్గా ఎంపికైంది.