స్వీటీ ఇచ్చిన రియల్ షాక్

స్వీటీ అనుష్క శెట్టి తనని విమర్శించిన వారికి సరైన జవాబు చెబుతున్నారా?  తన బరువు విషయంలో వచ్చిన రూమర్లకు చెక్ పెట్టేస్తూ మారిన రూపంతో షాకిస్తున్నారా? అంటే అవుననే  అర్థమవుతోంది. స్వీటీ గత కొంతకాలంగా విదేశల్లో ప్రత్యేకించి బరువు తగ్గేందుకు ట్రీట్‌మెంట్ తీసుకున్నారని, నేచురోపతి విధానం ద్వారా బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారమైంది. అనుష్క రిలీజ్ చేసిన తాజా ఫోటో చూశాక షాక్ తినడం అభిమానుల వంతయ్యింది. ఈ కొత్త ఫోటో చూశాక స్వీటీ ఇలా రివెంజ్ తీర్చుకుందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మారిన కొత్త రూపంతో అనుష్క తదుపరి  కోన వెంకట్ నిర్మించే చిత్రంలో నటిస్తారని ప్రచారం సాగుతోంది. 

Leave a Reply

Your email address will not be published.