తొలి ఫిలిం క్రిటిక్ ఎస్‌.వి.రామారావు

మ‌న దేశంలో సినిమా జ‌ర్న‌లిజానికి వున్న విలువ చాలా త‌క్కువ‌. ప్ర‌ఖ్యాత భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ద‌ర్శ‌కులు సత్యజిత్ రే, గురుద‌త్‌ల గురించి మొద‌ట పాశ్చాత్యులు పుస్త‌కాలు రాస్తే చ‌దువుకుని ఆనందించిన చ‌రిత్ర మ‌న‌ది. మ‌న దేశంలో సినిమా పుట్టిన‌ప్ప‌టి నుండీ దేశంలో సినీ చ‌రిత్ర‌కు సంబంధించిన అధ్య‌య‌నం ఇంకా అసంపూర్తిగానే ఉంది. పాశ్చాత్య‌దేశాల్లో సినిమా ఆవిర్భ‌వించిన నాటి  నుండే సినిమా జ‌ర్న‌లిజం కూడా స‌మాంత‌రంగా ఎదుగుతూ వ‌చ్చింది. ఎంద‌కో తెలియ‌దుకానీ మొద‌టి నుండి కూడా  సినిమా జ‌ర్న‌లిజం వ‌ల్ల ఎక్కువ‌మందికి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌క‌పోవ‌టం కూడా ఇందుకు కార‌ణం కావ‌చ్చు. చాలా మంది సినిమా జ‌ర్న‌లిస్టులు, విమ‌ర్శ‌కులుగా కొంత‌కాలం మాత్ర‌మే కొన‌సాగొ ఆ త‌రువాత ఇత‌ర రంగాల్లో స్థిర‌ప‌డ్డారు. అలాంటి వారిలో ఆచార్య ఎస్‌.వి.రామారావు ఒక‌రు. తెలుగు సినిమాల పై ఉత్త‌మ విమ‌ర్శ‌లు చేసిన తొలి ఫిలిం క్రిటిక్ గా ఆయ‌న్ని పేర్కొనవ‌చ్చు.
 సినిమాల ప‌ట్ల ఎస్‌.వి.రామారావుది ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయం. ఏ సినిమా అయినా సామాజిక ప్ర‌యోజ‌నాన్ని క‌లిగి ఉండాలి అని ఆయ‌న విశ్వ‌సిస్తారు. వినోదం మాత్ర‌మే కాకుండా విజ్ఞానాన్ని కూడా ప్ర‌ధానంగా భావించిన నాడే చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ బాగుప‌డుతుంద‌ని ఆయ‌న భావిస్తారు. స్టార్ వ్యాల్యూతో పాటు, క‌థ‌, స్క్రీన్‌ప్లేలు బ‌లంగా ఉంటేనే సినిమా విజయం సాధిస్తుంది అని ఆయ‌న న‌మ్మేవారు. చాలా మందికి ఎస్‌.వి.రామారావు కేవ‌లం తెలుఉగ సాహిత్య విమ‌ర్శ‌కునిగా, సాహిత్య చ‌రిత్ర‌కారునిగా మాత్ర‌మే తెలుసు. కానీ, ఆయ‌న తెలుగు సినిమా ల‌పై అనేక సాధికారిక విమ‌ర్శ‌లు అందించిన విష‌యం చాలా మంది తెలుగు వారికి తెలియ‌దు. చ‌ల‌న‌చిత్ర రంగం ఉత్త‌మ ఎస్వీ రామారావు ఎస్వీ సినీక‌లం మ‌రియు ఒక ప్రేక్ష‌కుడు పేర్ల‌తో చిరంజీవులు, మ‌హాల‌క్ష్మీ, బాల‌నాగ‌మ్మ‌, వ‌దిన‌గారి గాజులు వంటి తెలుగు క్లాసిక్స్ లాంటి అనేక తెలుగు సినిమాల పై ఉత్త‌మ విమ‌ర్శ‌లు అందించారు. అదే స‌మ‌యంలో హిందీలో మొఘ‌ల్ ఏ అజం, న‌వ‌రంగ్‌, ఛ‌బీలీ, ఏక్‌కెబాద్ ఏక్‌, మైన‌షేమే హూ, న‌యా సంసార్‌, సుజాత‌, సంతాన్‌, హిందీ చిత్రాల పై కూడా ఆయ‌న స‌మీక్ష‌లు రాశారు. దాంతో మంచి ప్రామాణిక‌మైన గొప్ప సినీ విమ‌ర్శ‌కులుగా ఆయ‌న కృషి గ‌ర్తింపు ల‌భించింది.
 బాల్యంలో ఆయ‌న పుట్టి పెరిగిన పూరి జాత‌ర‌లో టూరింగ్ టాకీసులో సినిమాలో చూసి వాటి పై ఆస‌క్తి పెంచుకున్నాడు. వ‌న‌ప‌ర్తి హైస్కూలులో ఆయ‌న చ‌దువుతున్న‌ప్పుడు జెమిని వారి బి.ఎన్‌రెడ్డి, కెవిరెడ్డిల చిత్రాల‌కు ఈ రోజుల్లో ప్రేక్ష‌కాద‌ర‌ణ బాగా ఉండేది. హైద‌రాబాద్‌లో డిగ్రీ చ‌దువుకునే రోజుల్లో తెలుగుతోపాటు హిందీ చిత్రాల స‌మీక్ష‌లు అచ్చ‌య్యాయి. సుమారుగా ప‌దేళ్ళ‌పాటు ఆయ‌న నిరంత‌రంగా సినీ విమ‌ర్శ‌లు రాశాడు. అనంత‌రం సాహిత్య ప‌రిశోధ‌నా రంగంలో ప‌డి సినిమా విమ‌ర్శ‌ల‌కు కొంత దూర‌మ‌య్యాడు. అయితే, ఆ త‌రువాత ల‌గే ర‌హో మున్నాభాయ్‌, ల‌గాన్ వంటి అమీర్‌ఖాన్‌, శ్యాంబెన‌గ‌ల్ సినిమాల పై అప్పుడ‌ప్పుడూ విమ‌ర్శ‌లు రాశాడు. తెలుగు నాట ప్ర‌భంజ‌నంలాగా నిర్మాణ‌మ‌వుతున్న సినిమాల పై ఆయ‌న విమ‌ర్శ‌లు ఒక్క‌సారిగా ఆగిపోయాయి. కార‌ణం? సాహిత్యం వైపు ఆయ‌న క‌లం ఎక్కువ‌గా స‌మ‌యం కేటాయించ‌డ‌మే.
ఎస్‌.వి.రామారావు 1941 జూన్ 5న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా శ్రీ‌రంగాపురంలో జ‌న్మించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుండి తెలుగులో సాహిత్య విమ‌ర్శ‌, అవ‌త‌ర‌ణ‌, వికాసాలు అన్న అంశం పై పిహెచ్‌.డి. చేశారు. జ‌ర్న‌లిజంలో డిప్లొమా చేశారు. లెక్చ‌ర‌ర్‌గా, ఉస్మానియాలో రీడ‌ర్‌గా, తెలుగుశాఖ అధిప‌తిగా ప‌నిచేశారు. సుమారు 20 గ్రంథాలు రాసి మ‌రో 15 సంచిక‌ల‌కు  సంపాద‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న అపార సాహిత్య సంప‌ద‌కు అందుకున్న అవార్డుల‌కు లెక్క‌లేదు.  దివాకర్ల‌, వాన‌మామ‌లై, బి.ఎన్‌,శాస్త్రి, గుర‌జాడ‌, దాశ‌ర‌థి, ఉమ్మెత్త‌ల, బూర్గుల రామ‌కృష్ణారావు, సుర‌వ‌రం ప్ర‌తాప‌రెడ్డి మొద‌లైన మ‌హామ‌హుల పేరిట నెల‌కొల్పిన స్మార‌క పుర‌స్కారాల‌ను ఆయ‌న అందుకున్నారు. ఆ అవార్డులే ఆయ‌న‌లోని అద్భుత ప్ర‌తిభ‌కు గీటురాళ్ళు, తార్కాణాలు.
 విమ‌ర్శ‌కుడిగా ఒక సినిమాను స‌మీక్షించేప్పుడు నిర్మాణానికి సంబంధించిన ఎన్నెన్నో అంశాల‌ను ఆయ‌న ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకునేవాడు. అటు ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తూ ఇటు నిర్మాత‌లు ఆర్ధికంగా విజ‌యం సాధించాలి అని స‌మ‌తుల్య‌త‌ను త‌న విమ‌ర్శ‌ల‌లో ఆయ‌న పాటిస్తారు. సినిమాను ఒక విమ‌ర్శ‌కుడు సామాజిక దృష్టితో చూసినా వాస్త‌విక దృక్ప‌థంతోనూ చూడాలంటారు. ఒకే విష‌యాన్ని గూంజ్ ఉఠీ పెహ‌నాయ్ సినిమాను స‌మీక్షిస్తూ ఆయ‌న మూస‌లో ఒకే సంప్ర‌దాయాన్ని అనుస‌రిస్తూ సినిమాలు తీయ‌రాదు.
నిజాన్ని భూత‌ద్దం పెట్టి వెదికే వాళ్ళ‌కు లోకానిదంతా వ్యాపార స‌ర‌ళిగానే క‌నిపిస్తుంది. అందుకే చివ‌ర గోపి కిష‌న్‌లు అలా ప్రాణాలు వ‌ద‌ల వ‌ల‌సి వ‌చ్చిందేమొ  అంటారు ఎస్వీ రామారావు  త‌న విమ‌ర్శ‌లో. సినిమా విమ‌ర్శ‌కులు ఏదో చిత్రాన్ని స‌మీక్షించ‌డం కాకుండా సినిమా చరిత్ర‌కు సంబంధించిన స్ప‌ష్ట‌మైన అవగాహనా  అవ‌స‌ర‌మ‌ని ఎస్వీరామారావు నిరూపించారు. ఒకే క‌థాంశం పై వ‌చ్చిన చిత్రాల‌ను స‌మీక్షించేప్పుడు ఈ ప‌రిజ్ఞానం ఎక్కువ‌గా ఉప‌క‌రిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు 1959లో వ‌చ్చిన వెంక‌ట‌ర‌మ‌ణావారి బాల‌నాగ‌మ్మ చిత్రాన్ని స్వ‌తంత్ర వార‌ప‌త్రిక (31-10-1959)లో స‌మీక్షిస్తూ1942లో వ‌చ్చిన జెమిని వారి, శాంత‌వారి బాల‌నాగమ్మ‌ల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా ఉటంకించారు. ఇదే సంచిక‌లో గురుద‌త్ న‌టించిన కాగ‌జ్‌కీ పూల్ హిందీ చిత్రాన్ని కూడా ఆయ‌న స‌మీక్షించాడు. ఇందులో గురుద‌త్ చెప్పుకున్న గాథ (బాధ‌)లో ఏదో వెలితి క‌నిపిస్తుంది. అది ఎక్క‌డ దాగి ఉందో చెప్ప‌డం క‌ష్టం అంటారు. కాగ‌జ్‌కీ పూల్  ఆర్ధికంగా విజ‌యం సాధించ‌క‌పోయినా అభిరుచిగ‌ల ప్రేక్ష‌కున‌కి గురుద‌త్ న‌ట‌న అజ‌రామ‌రం. ద‌ర్శ‌కుడు ఆయా పాత్ర‌ల‌ల‌ను తెర‌మీద ఆవిష్క‌రించ‌డంలో గొప్ప ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించాడు. తెర వెనుక ద‌ర్శ‌కుడిగా గురుద‌త్ ఎంత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచాడో తెర‌మీద న‌టుడిగా అంత రాణించ‌లేదు అని త‌న విమ‌ర్శ‌లో ఆయ‌న అన్నారు. దానికి ఎంతో సాహ‌సం కావాలి. అలాంటి సాహ‌సం విమ‌ర్శ‌కుడికి వుండాల‌ని ఆయ‌న భావిస్తారు. అస‌లైన విమ‌ర్శ‌కుడిగా ఉండాలంటే ధైర్యం కావాలంటారాయ‌న‌.
తెలుగు సాహిత్య విమ‌ర్శ గురించి సాధికారిక‌మైన ప‌రిశోధ‌న చేసిన ఎస్వీ రామారావు సినిమా విమ‌ర్శ‌లో కూడా స‌ద్వివేచ‌న‌తోపాటు, సామాజిక‌స్కృహ అవ‌స‌ర‌మ‌నీ అంటారు. స్వ‌తంత్ర‌, 1 ఆగ‌స్ట్ 1959 సంచిక‌లో మై న‌షేమే హూ సినిమాను విమ‌ర్శిస్తూ ప్ర‌యోజనం కోసం కాక‌పోయినా ఇతివృత్తంలో ఏ క‌థాంశం ఉంద‌ని నిర్మాత‌లు దీని చిత్రంగా నిర్మించారో అర్ధం కాదు. స‌హ‌వాస దోషాన ఏదో కొన్ని దుర‌ల‌వాట్లు అల‌వ‌డినంత మాత్రాన వ్య‌క్తిత్వాన్ని చంపుకొని అల‌వాటుకు బానిస‌లై, తానే జీవితానికి స్వ‌యంగా క‌ళంకాన్నిఆపాదించుకున్న‌ది కాక న‌న్ను చూసి జాలిప‌డండి అంటూ రాజ్‌క‌పూర్‌లా ఫోజు పెట్టినంత మాత్రాన ఆ పాత్ర పై సానుభూతి ఎందుకు కురుస్తుంది అంటారు రామారావు. చిత్ర‌సీమ జ‌న‌వ‌రి 1957 సంచిక‌లో 1956లో విడుద‌లైన చిత్రాల‌ను సింహావ‌లోక‌నం చేస్తూ బాల‌స‌న్యాస‌మ్మ చిత్రం మ‌న సంస్కృతిని ప్ర‌తిబింబించే చిత్రం అయినా ఇందులో భ‌ర్త‌తో పాటు భార్య ప్రాణాల‌ను త్య‌జించ‌డాన్ని స‌న్యాస‌మ‌న‌దు, మ‌న సంప్ర‌దాయం దాన్ని స‌మ‌ర్ధించ‌దు అంటారు.ఈ దృష్టితో చూస్తే ఎస్వీ రామారావులో మంచి సినీ విమ‌ర్శ‌కుడితో పాటు గొప్ప సంస్కార‌వాది కూడా క‌నిపిస్తారు.
 ప్ర‌స్తుత సెన్సార్ విధానం పై ఏళ్ళ త‌ర‌బ‌డిగా చ‌ర్చ‌లు, ఎన్నో వాదోప‌వాదాలు జ‌రుగుతున్నాయి. 1956లో సినిమా రంగం మాస‌ప‌త్రిక‌లో రామ‌శ‌ర్మ ప్ర‌శ్న‌కు జ‌వాబుగా ఎస్వీ ఒక లేఖ రాస్తూ క‌ళ అనే పేరుతో చ‌వ‌క‌బారు వినోదాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించి డ‌బ్బు చేసుకోవ‌డానికి చ‌ల‌న‌చిత్ర ప‌రివ్ర‌మ అల‌వాటు ప‌డుతోంది. ఈ అల‌వాటు అటు దేశానికి, ఇటు చిత్ర ప‌రివ్ర‌మ మేల్కోవాలంటే ప్రజాక్షేమాన్ని కాపాడే దిశ‌గా ప్ర‌భుత్వం ఆలోచించాలి. సెన్సార్ విదూర‌మైన స‌న్నివేశాల‌ను నిర్మాత‌లు నిర్మించ‌కుండా చూడ‌వ‌ల‌సి ఉంటుంది. సెన్సార్ ఉండాలా లేదా అనేది సైద్ధాంతిక‌ప‌ర‌మైంది.  నిర్మాత‌లు డ‌బ్బుకు కక్కుర్తి ప‌డ‌కుండా సామాజిక బాధ్య‌త‌ను గుర్తించి ప్ర‌జ‌ల‌కు శిక్ష‌కులుగా త‌మ పాత్ర నిర్వ‌హించిన‌ట్ల‌యితే సెన్సార్ ఉండాలా లేదా అనేది సైద్ధాంతిక‌ప‌ర‌మైంది. నిర్మాత‌లు డ‌బ్బుకు కక్కుర్తి ప‌డ‌కుండా స‌మాజిక బాధ్య‌త‌ను గుర్తించి ప్ర‌జ‌ల‌కు శిక్ష‌కులుగా త‌మ పాత్ర నిర్వ‌హించిన‌ట్ల‌యితే సెన్సార్ నిబంధ‌న‌లు అమ‌లు ప‌ర‌చ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు** అంటారు. కానీ నాటికీ, నేటికీ కాలం మారింది. సెన్సార్ విధానం ఎలా ఉంద‌నే విష‌యాన్ని అలా ఉంచితే నేడు అడ్డూ అదుపూ లేకుండా వ‌స్తున్న అశ్లీల‌, హింసాత్మ‌క చిత్రాలు స‌మాజాన్ని నాశ‌నం చేస్తున్నాయి. ఇందుకెవ‌రు బాధ్యులు?ద‌ర్శ‌కులా? న‌ర్మాత‌లా? హ‌ఈరోలా?  సెన్సార్ వారా? ల‌ఏక ప్రేక్ష‌కులా? అంటే ఖ‌చ్చితంగా ఫ‌లానా వారే అందుకు కార‌కులుగా చెప్ప‌లేం, దానికి అంద‌రూ బాధ్యులే. వీరంద‌రిక‌న్నా ప్ర‌ధానంగా బాధ్యులు ప్రేక్ష‌కులే అవుతారు. ఈ విష‌యం పై ఎస్వీ రామారావు చిత్ర‌సీమ (జులై- 1956)లో ఇలా రాస్తారుః
 ఈ నాడు తెలుగు చిత్ర‌ప‌రివ్ర‌మ ఇంత‌టి అధోగ‌తిలో ఉందంటే దానికి కార‌ణం ప్ర‌జ‌లేగాని నిర్మాత‌లు కారు. బంగారుపాప లాంటి క‌ళాత్మ‌క చిత్రాల‌కు త‌మ హృద‌యంలో తావివ్వ‌కుండా, కొన్ని అసంబ‌ద్ద చిత్రాల‌ను అమితంగా గౌర‌విస్తూర‌జ‌తోత్స‌వాలు జ‌రిపిస్తున్న‌ప్పుడు నిర్మాత లెలా ధైర్యం వ‌హించి మంచి చిత్రాలు నిర్మించ‌డానికి ముందుకు రాగ‌లుగుతారు?వ‌దిన లాంటి తుక్కు చిత్రాల‌కు ల‌భించిన గౌర‌వం బంగారు పాప‌, క‌న్యాశుల్కంల‌కు ల‌భించ‌క‌పోయిలందంటే మ‌న ప్రేక్ష‌కుల క‌ళాత్మ‌క దృష్టి ఎటువంటిదో సుల‌భంగానే అర్థ‌మ‌వుతుంది. ఏమైనా ప్ర‌జ‌లు బంగారుపాప వంటి చిత్రాల‌లోని నైతిక విలువ‌ను గ్ర‌హించ‌గ‌లిగిన నాడే మ‌న ప‌రిశ్ర‌మ బాగుప‌డుతుంది. లేక‌పోతే  ఈ విధంగా అధోగ‌తొ పాలు కావ‌ల‌సిందే అని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు ఆయ‌న ఘాటుగా విమ‌ర్శించాడు. ఆయ‌న అలాంటి విమ‌ర్శ చేసి ఆరు ద‌శాబ్దాలు గ‌డిచాయి. కానీ, నేటి ప్రేక్ష‌కుల అభిరుచి నాటిక‌న్నా నేడు మ‌రింత‌గా దిగ‌జారింది. ప్రేక్ష‌కులు మంచి చిత్రాలు చూడ‌టం అల‌వాటు చేసుకోవాలి. చెత్త చిత్రాల‌ను బ‌హిష్క‌రించేందుకు పాటు ప‌డాలి. ఆ చిత్రాల పై విమ‌ర్శ‌ల‌తో కొంత మేర ప‌త్రిక‌లూ పాటు ప‌డాలంటారు ఎస్వీ, కానీ, రాను రాను సినిమా ప‌త్రిక‌లు మ‌ల్టీక‌ల‌ర్‌లో వెలువ‌డుతూ విషయానిక‌న్నా తార‌ల అర్ధ‌న‌గ్న చిత్రాల ప్ర‌చుర‌ణ‌కే పెద్ద‌పీట వేస్తున్నాయి. కొద్దో గొప్పో ఉత్త‌మ సినిమా విమ‌ర్శ‌ల‌ను ప్ర‌చురించే కొన్ని ప‌త్రిక‌లు కొంత‌కాలం మ‌నుగ‌డ సాగించినా ఆ ప‌త్రిక‌లు కూడా నేడు మూస బాట‌లో న‌డుస్తున్నాయి. కార‌ణం? అంద‌రికీ తెలిసిందే.
 తెలుగు సినిమాను 1931 నుండి అర‌వై ద‌శ‌కం వ‌ర‌కూ జాన‌ప‌ద‌, పౌరాణికాలే ఎక్కువ‌గా ఏలాయి. ఎస్‌.వి.కూడా ఈ కాలంలోనే సినిమా విమ‌ర్శ‌లు చేసిన వార‌వ‌డం వ‌ల్ల జాన‌ప‌ద‌, పౌరాణికాల‌కు ఎగ‌బ‌డ‌టం మానుకొని సాంఘిక చిత్రాలు నిర్మించ‌డం నేర్చుకోవాలి. మ‌నం కోరుతున్న‌ది తిరోగ‌మ‌నం కాదు, పురోగ‌మ‌నం. అయినా, ఈ విష‌యంలో ప్రేక్ష‌కుల దృష్టి కూడా హ‌ర్షింప‌ద‌గింది కాదు. వారి దృష్టి మార‌నంత కాలం తెలుగు ప‌రిశ్ర‌మ‌కు అధోగ‌తిపాలు త‌ప్ప‌ద‌ని వారు గ్ర‌హించుకోవాలి. వారి దృక్ప‌థంలో ప‌రివ‌ర్త‌న క‌లిగిన నాడే మ‌న ప‌రిశ్ర‌మ‌నావ‌రిచుకున్న
అంధ‌కార ఛాయ‌ల్ని చీల్చుకుని బ‌య‌ట‌ప‌డ‌గ‌ల‌గుతుంది అని  చిత్ర‌సీమ‌లో (సెప్టెంబ‌ర్ 1956) అభిప్రాయ‌ప‌డ్డారు.  వాస్త‌వానికి అప్ప‌టికి వీరి అభిప్రాయం స‌రైందే. అమోద యోగ్య‌మైందే. యాదృచ్చితంగా70 ద‌శ‌కం నుండి సాంఘిక చిత్రాల నిర్మాణం పుంజుకుంది. ఈ సంఘికాలు సామాజిక ప్ర‌యోజ‌నాన్ని ఆశించే మాట అటుంచి యువ‌త‌రాన్ని పెడ‌దోవ ప‌ట్టించే ధోర‌ణుల‌కు ఊత‌మిస్తున్నాయి. విజ్ఞానం ముగుసులో బూతు చిత్రాలు రూపొందుతున్నాయి. ఒక‌వేళ ఎస్వీ ఈ త‌రుణంలో మ‌ళ్ళీ పౌరాణిక‌, జాన‌ప‌ద చిత్రాలు రూపొందాల‌ని అంటారేమో ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతానికి చెందిన సాహిత్య‌, చ‌ల‌న‌చిత్ర విమ‌ర్వ‌కుడుగా ఎదిగిన మ‌న య‌స్‌.వి.రామారావు నిజ‌మైన స‌వ్య‌సాచి.

Leave a Reply

Your email address will not be published.