ప్రేమజంటలతో కిక్కిరిసి పోయి ఉండే హైద‌రాబాద్ బోసిపోయి కన్పిస్తున్నాయి.

నిత్యం ప్రేమికులతో కిటకిటలాడే హైద‌రాబాద్ పార్కులు ప్రేమికుల రోజు నాడు నిల‌బ‌డేందుకు కూడా చోటు దొర‌క‌నంత‌గా మారిపోతాయి. అయితే ఈ రోజు ప్ఏమికుల రోజు అయిన‌ప్ప‌టికీ రోజూలా ఉండే ప్రేమికుల సంద‌డి కూడా కన్పించక పోవ‌టం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ప్రేమజంటలతో కిక్కిరిసి పోయి ఉండే హైద‌రాబాద్ శివార్ల‌తో పాటు న‌డిబొడ్డున ఉన్న న‌క్లెస్ రోడ్, శిల్పారామం ఇలా పార్కుల‌న్నీ బోసిపోయి కన్పిస్తుండ‌టం విశేషం. ఇందుకు ప్ర‌ధానంగా బజరంగ్‌దళ్‌, రాష్ట్రీయ స్వయం సేవ‌క్ సంఘ్‌లాంటి హిందుత్వ సంస్థల హెచ్చరికలే ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

ప్రేమికులు పార్కుల్లో కనిపిస్తే పెళ్లి చేస్తామని, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తామని బజరంగ్‌దళ్‌ ప్రకటించింది. ఈ హెచ్చరికలు ప్రేమికుల దినోత్సవంపై పూర్తిగా ప్రభావం చూపించాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం సందడిగా ఉండే పార్కులలో సైతం వాలెంటైన్స్ హెచ్చ‌రిక‌ల ప్ర‌భావంతో పార్కులు వెలవెలబోయి కన్పిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.