ప్రపంచ డైనమిక్ నగరాల జాబితాలో మొదటి స్థానం హైదరాబాద్ దే…హైదరాబాద్ మ‌హాన‌గ‌రం మ‌రో అరుదైన గౌరవాన్ని త‌న సిగ‌లో చేర్చుకుంది.  సామాజిక ఆర్థిక అంశాలు,కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంశాల ప్రాతిపదికన   ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ (శక్తివంతమైన,క్రియాశీలకమైన) నగరంగా గుర్తింపు దక్కించుకుంది.  ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను  గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా సీఈవో రమేష్ నాయర్   మీడియాకు వివ‌రిస్తూ…  ఆర్థిక మందగమనం ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్నా  భారత్ నుంచి మొత్తం ఏడు నగరాలు టాప్-20లో స్థానం సంపాదించుకోవడం విశేషంగా పేర్కొంది.

 ప్రపంచవ్యాప్తంగా మొత్తం 130 దేశాలపై తాము అధ్యయనం చేసి డైనమిక్ సిటీల జాబితాను రూపొందించిన‌ట్టు గ్లోబ‌ల్ ప్రాప‌ర్టీ ప్ర‌తినిదులు వెల్లడించారు. ప్రపంచ డైనమిక్ నగరాల జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలవగా.. బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. చెన్నై ఐదో స్థానంలో, ఢిల్లీ ఆరో స్థానంలో నిలిచాయి. ఇక పుణే,కోల్‌కతా,ముంబై వరుసగా 12,16,20 స్థానాల్లో నిల‌చాయి. 

కాగా అత్యన్నత శ్రేణి బిజినెస్ పార్కులు, ఆర్థిక సూచిక పెరుగుద‌ల కార‌ణంగానే గతేడాది ఈ జాబితాలో  అగ్ర స్థానంలో నిల‌చిన బెంగళూరు ను సైతం వెన‌క్కి నెట్టి  హైదరాబాద్ ప్రపంచ దేశాలన్నింటి కంటే అగ్ర స్థానంలో నిలిచినట్టు జేఎల్ఎల్ మొమెంటమ్ ఇండెక్స-2020 వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published.