బీదర్ మహిళలపై దేశద్రోహం కేసు

బీదర్ మహిళలపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని నిరసిస్తూ సిఎం కార్యాలయంఎదుట ధర్నాకు దిగిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సహా పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు శనివారం ఈ అరెస్టులు జరిగాయి. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల బీదర్‌లోని షహీన్ పాఠశాలలో విద్యార్ధులు స్ధానిక యువతలు కలసి ఓ నాటకం ప్రదర్శించారు. అయితే ఈ నాటకంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయంటూ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. వీరిలో తొమ్మిది నుంచి పన్నేండు సంవత్సరాల పిల్లలను సైతం అదుపులోనికి తీసుకుని ఐదు రోజుల పాటు పోలీసులు ప్రశ్నించడం గమనార్హం. పైగా ఈ నాటకం ప్రదర్శించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఓ విద్యార్థి తల్లిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈవిషయంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటమే కాకుండా మంత్రులు చట్టం తన తని తను చేసుకుపోతుందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న క్రమంలోనే ఈ అరెస్టులు, దేశ ద్రోహ కేసులకు నిరసనగా రేస్ కోర్ట్ రోడ్ సమీపంలో కాంగ్రెస్ జరుపుతున్న ర్యాలీని అడ్డుకుని సిద్ధరామయ్యతో పాటు దినేశ్ గుండురావు, రిజ్వాన్ అర్షద్, కె. సురేశ్ తదితరులను అరెస్టు చేసారు.
ఈ సందర్భంగా సిద్దరామయ్య మీడియాలో మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను యడియూరప్ప సర్కార్ దుర్వినియోగం చేస్తోందని, తమను విమర్శిస్తే చిన్నారులైనా సరే దేశ ద్రోహం కేసులు పెడతామని బెదిరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.