ఆ దేశంలో వారానికినాలుగు రోజులే పనిదినాలు.. !
ఇప్పటికే దాదాపు అన్ని ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు రెండు రోజులు వారాంతపు సెలవులు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఫిన్లాండ్లో ఎనిమిది గంటలు పని వేళలు, 5 రోజులు పని దినాలు అమల్లో ఉన్నాయి. అయితే ఇది కూడా తమతో కలసి పనిచేసే ఉద్యోగులపై ఉన్న వత్తడికి సరిపోవటంలేదంటూ మూడు రోజులు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వమంటూ ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఫిన్‌ల్యాండ్ ప్రధానమంత్రి సన్నా మారిన్ ఆదేశాలిచ్చారు. అంతే కాదు త్వరలో ఉద్యోగుల పనిదినాలను నాలుగు రోజులకు కుదించడంతో పాటు ఇప్పటి వరకు 8 గంటల పనివేళల్ని కాస్త 4 గంటలకే కుదించడం ద్వారా మెరుగైన పనిని ఉద్యోగుల నుంచి రాబట్టకోవచ్చని సేలవిచ్చారు. ..
వారంలో మూడు రోజులు సెలవులు ఇస్తే, ప్రజలు కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడిపేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా మానసికంగా మన ఉద్యోగ జీవితంలో ఇది మరో ముందడుగు కావాలి’’ అని ఆమె చెప్పడంతో ఆ దేశంలోని పౌరులకు ఆనందానికి కొదవు లేకుండా పోయింది. ప్రధాని తీసుకున్న నిర్ణయానికి అక్కడి మంత్రుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.
2015లో స్వీడన్ ఆరు గంటల పనిదినాన్ని అమల్లోకి తీసుకురావటంతో అక్కడి ఉద్యోగుల పనివిధానంలో మార్పులు వచ్చాయి. క్రమశిక్షణతో పనిచేయడంతో ఆర్ధిక పరిస్థితి మెరుగుకు బాటలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఫిన్లాండ్లో అదే తరహాలో ఉద్యోగుల పనివేళలుండాలని భావించిన ప్రధాని సన్నా మారిన్ ఆదిశగా యోచించారు. త్వరలోనే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని అక్కడి అధికారులు చెపుతున్నారు.
కానీ మన దేశంలో పరిస్థితి వేరేలా ఉంది. కొన్ని ఐటీ సంస్థలు మాత్రమే వీకెండ్ వీక్లీ ఆఫ్‌లు శని, ఆది వారాల నిబంధన అమలు చేస్తున్నాయి. చాలా కార్పొరేట్ సంస్థలు , మీడియా సంస్థలు మాత్రం ఈనియమాలను పక్కకు పెట్టి తమ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న వైనాలు మనకి బోలెడు దర్శనమిస్తాయి. అయితే ఒక్కో దేశానికి ఒక్కో విధానం అన్నట్టు మన దేశానికి ఆదివారం శెలవొక్కడే సరిపోయినట్టుంది. అందుకే చాలా సంస్ధలు ఉద్యోగుల వీక్లీ ఆఫ్‌లు వారంలో ఒక రోజుని ప్రకటించినా, కొన్ని సంస్ధలలో మాత్రం సెలవు హరిస్తున్నాయి. ఆయా రోజులలో కార్యాలయానికి రావాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నా… కార్మిక శాఖ పట్టనట్టు వ్యవహరిస్తోందన్నది మాత్రం నిజం.