కోటికి వేటూరి స్మారక పురస్కారం

వేటూరి సుందరరామ్మూర్తి జయంతి (జనవరి 29)ని పురస్కరించుకుని ఆత్రేయ స్మారక కళాపీఠం, స్వరతరంగ్ సంయుక్త ఆధ్వర్యంలో  సంగీత దర్శకులు సాలూరి కోటికి వేటూరి స్మారక పురస్కారం ప్రదానం చేస్తున్నామని ఆత్రేయ స్మారక కళాపీఠం ప్రధాన కార్యదర్శి గంటి మురళీధర్ తెలిపారు. ఆదివారం ఉదయం విశాఖపట్న ం- లాసన్స్ బే కాలనిలోని  ఓ కార్యక్రమంలో ఈ వివరాల్ని వెల్లడించారు. నిర్వాహకులు మాట్లాడుతూ నేటి సాయంత్రం వైశాఖి జల ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో మూడు దశాబ్దాలుగా సినీరంగానికి సేవలందిస్తున్న సాలూరు కోటికి ఘన సత్కారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ కె హరిబాబు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, వీసీలు ఆచార్య జిఎస్‌ఎన్ రాజు, ఆచార్య జి నాగేశ్వరరావుతదితరులు హాజరవుతారని తెలిపారు. పాటల పూదోటలో రసరమ్యమైన పాటల్ని అందించిన వేటూరి 29 జనవరి 2010లో స్వర్గస్తులయ్యారు. నేడు ఆయన అభిమానులు ప్రత్యేకించి సంగీత విభావరి పేరుతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలు సంస్మరణ కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన కోటి నవతరం ప్రతిభావంతుల్ని ప్రోత్సహించారు. ఇటీవలే అనూహ్య ంగా  పాపులరైన సింగర్ బేబి కి ఆర్థిక సాయంతో పాటు మోరల్ గా అండగా నిలిచిన సంగతి తెలిసిందే. 

Leave a Reply

Your email address will not be published.