ఈసీ పై ఆరోపణలతో అబాసుపాలైన జగన్


రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న  నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు కులాన్ని ఆపాదించి, గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో  చంద్రబాబు త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని  నియమించుకున్నారని,  అందుకోస‌మే  బాబు డైరెక్ష‌న్‌లో ర‌మేష్ స్థానిక ఎన్నిక‌ల‌ను క‌రోనా ముసుగులో వాయిదా వేశారంటూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేసిన ఆరోపణ‌ల‌పై స‌ర్వ‌త్రా తీవ్ర విమ‌ర్శ‌లొస్తున్నాయి.

 స్థానిక ఎన్నికల్లో వైకాపా స్వీప్‌ చేస్తుందని భయపడి తన కులానికి చెందిన చంద్రబాబుకు మేులు చేయడానికే ఎన్నికల‌ కమీషనర్‌ రమేష్‌కుమార్‌ ఎన్నికల‌ను వాయిదా వేశారని,  చంద్రబాబు నియమించిన రమేష్‌ వ‌ల్ల‌ ఎన్నికలు ఆగిపోయాయని చెప్ప‌డం చూస్తుంటే ఈ రాష్ట్ర‌లో అధికారుల‌పై ఏమాత్రం అవ‌గాహ‌న ముఖ్య‌మంత్రికి ఉందో ఇట్టే అర్ధ‌మ‌వుతోంద‌ని వ్యంగ్య వాఖ్య‌లు సామాజిక మీడియాలో ట్రోల్ అవుతోంది.

.వాస్త‌వానికి  నాటి  చంద్రబాబునాయుడు రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌గా బిశ్వాల్ ను నియమించాల‌ని భావించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నర్సింహ్మన్ త‌న వ‌ద్ద కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్న‌ ర‌మేష్ ను సిఫార్సు చేసి ఎన్నికల‌ కమీషనర్‌గా నియమించుకున్న విష‌యం కూడా సిఎంకి తెలియ‌దా అంటూ కొంద‌రు సెటైర్ లు వేస్తున్నారు. 

 ఎలక్షన్ కమీషన్ త‌న ప‌ని నిర్వహిస్తే, ఎన్నికైన తామెందుకు అంటూ జ‌గ‌న్ హూంక‌రించ‌డంపైనా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈసి ఏం చేయాలో  రాష్టప్రభుత్వం ఎలా నిర్ధేశిస్తుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.  భార‌త‌ రాజ్యాంగం ప్రకారం   భారత ఎన్నికల క‌మిష‌న్‌కు ప్ర‌త్యేక అధికారాలుంటాయి.  రాష్ట్ర క‌మిష‌న్ల‌కి కూడా అనేక అధికారాలుంటాయ‌ని ఆ క్ర‌మంలో గ‌తంలో గ‌వ‌ర్న‌ర్ల‌ని సైతం నిలువ‌రించిన చ‌రిత్ర ఈసికి ఉన్న‌ప్పుడు, ఈసిపై గ‌వ‌ర్న‌ర్‌కి ఫిర్యాదు చేయ‌ట‌మేంట‌ని ఇది తెల‌య‌ని త‌త్వాన్ని బైట‌పెట్టుకుంటున్న‌ట్టుంద‌ని జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు జ‌డివాన కురుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published.