గురువారం నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

కరోనా కేసులు భార‌తావ‌నిలో పెరుగుతున్న నేప‌థ్యంలో  దీనిని కట్టడి చేయడం కోసం పౌరులు వీలున్నంత రోడ్ల‌పైకి రావ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేసిన   కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ క్ర‌మంలోనే   జనసమూహాలను నియంత్రించే ప‌నిలో ప‌డ్డాయి.  ఇప్పటికే స్కూళ్లు, సినిమా థియేటర్లు మూతపడగా.. తాజాగా దేశ వ్యాప్తంగా పలు ఆలయాలు సైతం మూసివేస్తుండ‌టం గ‌మ‌నార్హం.
తాజాగా గురువారం  నుంచి చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్  ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ   ఈ నెల 25 వరకు ఆలయం మూసివేయాల‌ని నిర్ణ‌యించామ‌ని,   స్వామి వారి ఆరాధన, నైవేద్య కార్యక్రమాలు కేవలం అర్చకులు మాత్ర‌మే నిర్వ‌హిస్తార‌ని తేల్చి చెప్పారు.  స్వామివారి ప్ర‌ద‌క్ష‌ణ‌లు నిల‌పివేసామ‌ని ఆల‌యానికి ఎవ‌రూ రావ‌ద్ద‌ని ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న‌లో కోరారు. 

Leave a Reply

Your email address will not be published.