ఓ చాయ్‌వాలా ని ప్ర‌ధానిగా చేసిన ఘ‌న‌త భార‌తీయుల‌దే : ట్రంప్‌

ఓ చాయ్‌వాలా ని ప్ర‌ధానిగా చేసిన ఘ‌న‌త భార‌తీయుల‌దేన‌ని ప్ర‌శంస‌లు గుప్పించారు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌. సోమ‌వారం ఆయ‌న అహ్మ‌దాబాద్‌లోని ప‌టేల్ స్టేడియంలో జ‌రిగిన న‌మ‌స్తే ట్రంప్ కార్య‌క్ర‌మానికి హాజ‌రై అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి మాట్లాడుతూ…  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చాయ్ వాలాగా అభివర్ణించారు.  ఈద‌శ‌లో చాయ్‌వాలా అనే పదాన్ని ట్రంప్ ఉచ్ఛరించలేక ఇబ్బంది ప‌డ్డారు. 
 ప్రపంచ దేశాలు సైతం భారత్ పట్ల గౌరవభావాన్ని చూపడానికి భారతీయుల వ్యక్తిత్వమే కారణమని, ఇందుకు ఒక చాయ్‌వాలాను శక్తిమంతుడైన నాయకుడిగా చేయ‌ట‌మే  భారతీయుల గొప్పద‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published.