‘అల… వైకుంఠపురములో’ చిత్రం విజయంపై నటులు స్పందన ….


‘అల… వైకుంఠపురములో’ చిత్రం విజయంపై పలువురు నటులు స్పదిస్తున్నారు. సినిమాలో బన్నీ నటనతో మైమరిపించాడని వారు ట్వీట్ చేస్తున్నారు. ఈ కోవలోనే ఎన్టీఆర్, శర్వానంద్ తివ్రికమ్ దర్శకత్వం, అల్లుఅర్జున్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమకు ‘అల… వైకుంఠపురములో’ తో భారీ విజయం తెచ్చిపెట్టారని శర్వానంద్ ట్వీట్ చేశాడు.  ఓనటుడిగా బన్నీ నుంచి అద్భుతమైన నటనను నేర్చుకోవచ్చని అన్నారు. 
 ఈసందర్భంగా చిత్రాన్ని ప్రశసించినందుకు శర్వానంద్‌కు బన్నీ ధన్యవాదాలు తెలిపారు. జనవరి 12న రిలీజైన అల… వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వందకోట్ల క్లబ్‌లో చిత్రం నిలిచే అవకాశం ఉంది. 

Leave a Reply

Your email address will not be published.