మూడు భాషల్లో రానా దగ్గుబాటి మూవీరానా దగ్గుబాటి హీరోగా తాజాగా అతిపెద్ద అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న సినిమా ‘అరణ్య’ .  . ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ  ఈ సినిమాని మూడు భాషల్లో నిర్మిస్తుండ‌గా ఈ మూడింటిలోనూ రానా హీరో కావ‌టం విశేషం.  తెలుగులో ‘అరణ్య’గా, తమిళంలో ‘కాడన్’గా, హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా పేరు పెట్టారు. ఈ సినిమాలో రాణాకు తోడుగా విష్ణు విశాల్, హిందీ వెర్షన్ ‘హాథీ మేరీ సాథీ’లో పుల్కిత్ సామ్రాట్ నటిస్తుండ‌గా…  శ్రియా పిల్గావోంకర్, జోయా హుస్సేన్ ఆసక్తికర పాత్రల్ని పోషిస్తున్నారు.  
 ఈ యాక్షన్ మూవీలో   రానా దగ్గుబాటి  35 ఏళ్ల   బాణదేవ్ అనే అడవి మనిషి పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించి, కఠిన శిక్షణతో 30 కిలోల బరువు తగ్గారు . బాగా పెరిగిన గడ్డం, గ్రే హెయిర్, పైకి వంచిన భుజంతో కనిపిస్తారు. 

ఈ సినిమాలో త‌న  పాత్ర గురించి రానా మీడియాకు వెల్లడిండిస్తూ,. “డైరెక్టర్ ప్రభు సాల్మన్ ఈ పాత్ర  వాస్తవికంగా, సహజంగా ఉండాలని భావించి, బ‌రువు త‌గ్గ‌మ‌న్నారు.  భారీకాయంతో, దృఢంగా ఉండాలనుకొనే నాకు  బరువుతగ్గడం అనేది   క్లిష్టమైన పనే అయినా బాణదేవ్ క్యారెక్టర్ కోసం సన్నగా మారేందుకు  తీవ్రమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుని ఏకంగా 30 కిలోలు త‌గ్గిపోయా…. అది నాకొక వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్ పీరియెన్స్” అని ఆయన తెలిపారు. అస్సాంలోని కజిరంగా ప్రాంతంలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు అక్రమంగా కబ్జా చేసిన దురదృష్టకర ఘటనను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించారు. వన్యప్రాణుల్నీ, ప్రకృతినీ కాపాడుకోవడానికి జరిగే ఘర్షణ ఈ సినిమా అన్నారు.   

Leave a Reply

Your email address will not be published.