వెంకీమామ స‌క్సెస్‌లో వెంకీ ఏడ్చాడా?


మామ అల్లుళ్ళ బంధం ఓ తీయ‌ని అనుభూతి. ఎవ్వ‌రికైనా త‌ల్లితండ్రుల త‌ర్వాత అంత‌టి భ‌రోసా ఉండే రిలేష్ అంటే అది మేన‌మామే అని చెప్పాలి. ఇక వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య రియ‌ల్ లైఫ్‌లోనే కాదు రీల్ లైఫ్‌లో కూడా ఆ అనుబంధం, ఆప్యాయ‌త‌ల గురించి చెప్పారు. ఈ చిత్రం నిన్న విడుద‌లై స‌క్సెస్ సాధించిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య‌లు చిత్ర స‌క్సెస్‌లో పాల్గొన్నారు. వెంక‌టేష్ కాస్త భావోద్వేగానికి గుర‌య్యారు.


వెంకీ బర్త్ డే సందర్భంగా  విడుదలై మంచి పాజిటివ్ టాక్‌‌ను రాబట్టింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, నాగ చైతన్యలు మామా అల్లుళ్లుగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఫుల్ ఎంటర్‌టైనర్ ఎమోషనల్ మూవీగా ‘వెంకీ మామ’ చిత్రం తొలిరోజు పాజిటివ్ టాక్‌ను రాబట్టింది.

ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ భావోద్వేగ పోస్ట్‌లు ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించిన ‘వెంకీ మామ’ చిత్రం సక్సెస్ కావడంతో ఈ ఆనంద సమయంలో తన తండ్రి దగ్గుబాటి రామానాయుడ్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు వెంకటేష్.

‘ఈ సంతోషంలో నువ్వు వుంటే బావుండేది నాన్నా’ అంటూ నాగచైతన్యతో చిన్ననాటి ఫొటోని షేర్ చేశారు వెంకటేష్. ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తీసి మూవీ మొగల్‌గా పేరు గాంచిన రామానాయుడుకి కొడుకులు, మనవళ్లతో సినిమా తీయాలని కోరిక ఉండేదట. అయితే నేడు ‘వెంకీ మామ’ చిత్రంతో ఆయన కోరిక నెరవేరింది. అయితే ఆ ఆనందకర సమయంలో రామానాయుడు లేకపోవడంతో ఆయన్ని గుర్తు చేసుకున్నారు వెంకటేష్.

ఈ సందర్భంగా ‘మిస్ యు నాన్నా’.. అంటూ వెంకీమామ ఇప్పుడు మీ అందరిదీ. దగ్గరలోని థియేటర్‌కు వెళ్లి చూడండి. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి’ అని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు వెంకటేష్. ఎంతైనా  ఒక ఫ్యామిలీలో నుంచి ఇద్ద‌రు హీరోలు వ‌చ్చి మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌డ‌మ‌నేది వాళ్ళ‌కే కాదు ఇటు ప్రేక్ష‌కుల‌కు కూడా పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్త‌ది. అందులోనూ మామ అల్లుళ్ళ రిలేషన్ అంటే ఆ క్రేజ్ కాస్త డిఫ‌రెంటే.

Leave a Reply

Your email address will not be published.