కథానాయుకుడిగా బాల‌కృష్ణ ‘రూల‌ర్’..



బాల‌కృష్ణ కథానాయుకుడిగా కెఎస్ ర‌వికుమార్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రూల‌ర్’. సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో బాలయ్య చెప్పే డైలాగులు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో భూమిక, జయసుధ, ప్రకాశ్ రాజ్, సప్తగిరి తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published.