టీడీపీ, వైసీపీ చాలా ప్రమాదాకరమైనవిటీడీపీ, వైసీపీ చాలా ప్రమాదాకరమైనవని ఆ పార్టీలతో జ‌త క‌ట్టే ప్ర‌శ్నేత‌లెత్త‌ద‌ని అన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ ఏపీ ఇన్‌చార్జి సునీల్ దియోధర్ శనివారం ఆయ‌న మీడియాలో మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ తమకు రాజకీయ శత్రువులేనని వారితో ఎట్టిప‌రిస్థితిలో పొత్తు పెట్టుకోబోమ‌ని, ఇప్పటికే జనసేనతో, బీజేపీ పొత్తు పెట్టుకుందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్తామని, ఇందులో ఎటువంటి సందేహం లేద‌ని స్ప‌ష్టం చేసారు. 

ఎన్డీయేలో వైసీపీ భాగస్వామ్యం కానుందంటూ మీడియాలో వ‌స్తున్న వార్తల వెనుక టీడీపీ ఉంద‌ని, ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఇందుకు సాక్ష్యామ‌ని అన్నారు. సీఎం జగన్ ఢిల్లీ టూర్‌పై ఆయన స్పందిస్తూ, రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఢిల్లీ వ‌చ్చిన‌ప్పుడు ప్రధాన మంత్రి, హోం మంత్రిని కలవడం సహజమేన‌ని, అంత‌మాత్రాన కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఆ పార్టీల‌కు చోటు ఉంటుంద‌ని అన‌టం స‌రికాద‌న్నారు. 

ఏపి సీఎం జగన్ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న కార‌ణంగా రాష్ట్ర‌ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆందోళ‌న క‌ర నిర్ణ‌యాలు ఇక్క‌డ నుంచి పరిశ్రమలు త‌ర‌లిపోయే పరిస్థితి ఏర్పడిందని దియోధర్ విమర్శలు గుప్పించారు.


Leave a Reply

Your email address will not be published.