వ్యక్తిగత కక్ష్యలతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ జిల్లాలో ఘోరం…..ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. తమ వ్యక్తిగత కక్ష్యలతో జరిగిన పరస్పర కాల్పుల్లో ఆరుగురు మృతి చెందిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ జిల్లా ప్రాంతంలో ఉంటున్న మావోయిస్టుల ఏరివేతకు సిఆర్‌పిఎఫ్‌ దళాలతోపాటు ఇండోటిబెటెన్‌ బోర్డర్‌ పోలీస్‌ దళాలను అక్కడి ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో  కేడేనార్‌ పోలీస్‌ క్యాంపులో ఉంటున్న ఐటిబిటి 45వ బెటాలియన్‌ పోలీసులు తమ మధ్య ఉన్న వ్యక్తిగత కక్ష్యల కారణంగా జరిగిన ఘర్షణలో వారి దగ్గర ఉన్న తుపాకులతో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ దాడుల్లో హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ మహేంద్ర సింగ్‌, పంజాబ్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ దల్‌జిత్‌ సింగ్‌, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుర్జీత్‌ సర్కార్‌, బిశ్వరూప్‌ మహంతో, కేరళకు చెందిన బిజేష్‌, మధుసూదల్‌ రెహమాన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కేరళ రాష్ట్రం త్రివేండ్రానికి చెందిన ఎస్‌బి ఉల్లాస్‌, రాజస్థాన్‌కు చెందిన సీతారాంలను రారుపూర్‌ సమీపం లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.Leave a Reply

Your email address will not be published.