నిర్మాత ముఖంలో నవ్వు కనబడాలి – కళ్యాణ్ రామ్

కొత్తదనంతో సినిమా చేస్తే ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారని మరోసారి రుజువు చేసారని అన్నారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్.   ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 118. కె.వి.గుహన్ దర్శకుడు. మహేష్ కోనేరు నిర్మించగా  నివేథా థామస్, షాలిని పాండే కథానాయికలుగా నటించారు. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్రబృందం విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు  ఈ సందర్బంగా హీరో  కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ నవ్యమైన కథాంశాలతో తెరకెక్కిన సినిమాను ఆదరిస్తే మాలో ధైర్యం పెరుగుతుంది.

ఈ సినిమాను విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని .. ఈ సక్సెస్ ద్వారా తనకు కొత్త తరహా కథలు చేయాలన్న నమ్మకం మరింత పెరిగిందని అన్నారు.  నా నువ్వే ద్వారా నాకో మంచి సినిమా ఇవ్వలేకపోయానని నిర్మాత మహేష్ కోనేరు చాలా బాధపడ్డాడు. ఈ సినిమా సక్సెస్‌తో అతడి ముఖంలో ఆనందం కనిపిస్తున్నది. అందరికంటే ముందు తారక్ ఈ సినిమా చూశాడు. విజయం సాధిస్తుందని చెప్పి మాకు అండగా నిలిచాడు. తారక్ నమ్మకం నిజమైంది అని తెలిపారు. నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ గుహన్ విజన్ వల్లే ఈ విజయం సాధ్యమైంది. తాను నమ్మిన విలువలకు కట్టుబడి ఏ విషయంలో రాజీపడకుండా ఈ సినిమా చేశారు. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఓపెనింగ్స్ బాగున్నాయి.  టీమ్ సమిష్టి కృషికి దక్కిన ఫలితమిది అని అన్నారు.  ఇలాంటి ఓ విలక్షణమైన పాయింట్‌తో కథను రాయడానికి, సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలని, ఇంత మంచి పాత్ర ఇచ్చి నటిగా నన్ను తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేసారని హీరోయిన్ నివేథా థామస్ చెప్పింది. దర్శకుడిగా తన ప్రయత్నం సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు .. ఇంత మంచి విజయంతో తనకు మనో ధైర్యాన్ని ఇచ్చారని దర్శకుడు గుహన్ చెప్పారు .. ఈ కార్యక్రమంలో మిగతా టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.