నెక్ట్స్ ఏంటీ?

Star Cast: తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవ్‌దీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్
Director: కునాల్ కోహ్లీ ఆధునిక సమాజంలో యువత పోకడలు మారుతున్నాయి. సహజీవనం లాంటి అంశాలు సొసైటీలో భాగమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో సహజీవనం, పెళ్లికి ముందు రిలేషన్స్ లాంటి బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన చిత్రం నెక్ట్స్ ఏంటీ?. మిల్కి బ్యూటీ తమన్నా భాటియా, సందీప్ కిషన్ జంటగా నటిస్తుండటం, బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ నేరుగా తెలుగులో నిర్మించడంతో సినిమాపై యూత్‌లో కొంత ఆసక్తి పెరిగింది. నెక్ట్స్ ఏంటీ మూవీ తమన్నా, సందీప్‌కు సక్సెస్‌ను అందించిందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే నెక్ట్స్ ఏంటీ కథ ఏంటో తెలుసుకోవాల్సిందే.
లండన్‌లో పెరిగినప్పటికీ భారతీయ సంప్రదాయాలకు విలువనిచ్చే యువతి టామీ (తమన్నా భాటియా). తల్లి చిన్నతనంలో మరణించడంతో తండ్రి పెంపకంలోనే పెరుగుతుంది. అలాంటి టామి సంజు (సందీప్) అనే యువకుడితో ప్రేమలో పడుతుంది. ఆర్నెళ్ల తర్వాత పెళ్లికి ముందే సెక్స్ విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోతారు. ఆ తర్వాత క్రిష్ (నవదీప్) అనే పారిశ్రామిక వేత్తతో రిలేషన్ పెట్టుకోవడం అది కూడా బ్రేకప్ కావడంతో మగవాళ్లపై ఓ రకమైన విద్వేషం పెంచుకొంటుంది?