ఈ బ్యాంకుల ఆఫ‌ర్లు అద‌ర‌హో

వ్యాపార రంగంలో పోటీ అనేది ఎక్క‌డైనా స‌ర్వ‌సాధార‌ణం. అందులోనూ బ్యాంక్‌ల విష‌యాల్లో ఇలాంటి పోటీ కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. భార‌త దేశంలోనే పెద్ద బ్యాంక్‌లైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), హెడిఎఫ్‌సీ బ్యాంక్ మ‌ధ్య పెద్ద పోటీ న‌డుస్తుంది. మార్కెట్‌లో వాటా విష‌యంలో దూసుకెళుతున్నాయి.  ఎస్‌బీఐ తాజాగా ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించింది. ఈ నేపథ్యంలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ రేటులో కోత విధించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఎంసీఎల్ఆర్ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఎస్‌బీఐ 10 బేసిస్ పాయింట్ల కోత కన్నా ఇది ఎక్కువ కావడం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నవంబర్ నెలలో కూడా ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు నిర్ణయం డిసెంబర్ 7 నుంచే అమలులోకి వచ్చింది. తాజా రేట్ల తగ్గింపుతో ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతనానికి దిగొచ్చింది. 10 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో 8.15 శాతానికి దిగొచ్చింది.

ఇకపోతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2 ఏళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో 8.25 శాతానికి దిగొచ్చింది. అలాగే 3 ఏళ్ల ఎంసీఎల్ఆర్ రేటు కూడా 15 బేసిస్ పాయింట్లు తగ్గింది. 8.35 శాతంగా ఉంది. ఇక ఈ ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపుతో రుణ రేట్లు కూడా దిగిరానున్నాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత హోమ్ లోన్స్‌పై ఈఎంఐ భారం తగ్గనుంది.

ఇక దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ తాజాగా ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రేట్ల తగ్గింపు నిర్ణయం ఈ రోజు నుంచే అమలులోకి వచ్చింది. 2019 డిసెంబర్ 10 నుంచి ఏడాది ఎంసీఎల్ఆర్‌తో లింక్ అయిన హోమ్ లోన్స్‌పై ఎంసీఎల్ఆర్ రేటు 7.9 శాతానికి దిగిరానుంది.

ఇక ఈ రెండు బ్యాంకుల ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు నిర్ణయాలను పరిశీలిస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 15 బేసిస్ పాయింట్ల వరకు ఎంసీఎల్ఆర్‌ను తగ్గించింది. ఎస్‌బీఐ 10 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్‌లో కోత విధించింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ ఏడాది ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.15 శాతంగా, ఎస్‌బీఐ ఏడాది ఎంసీఎల్ఆర్ 7.9 శాతంగా ఉంది. అంటే ఎస్‌బీఐలో హెమ్ లోన్స్‌పై తక్కువ వడ్డీ పడుతుంది.


Leave a Reply

Your email address will not be published.