జవాన్లకు స్టార్ల సాయం శహభాష్ ==== అమర జవాన్ల కుటుంబాలకు స్టార్ల సాయం ===== అమర జావన్ల కుటుంబాలకు స్టార్ల సాయం

అమర జవాన్ల కుటుంబాలకు సానుభూతి వెల్లువ అసాధారణంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటు కామన్ జనాల నుంచి.. అటు సెలబ్రిటీల నుంచి దుర్మార్గపు ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. పాక్ ప్రేరేపిత జేషే మహ్మద్ తీవ్రవాద సంస్థకు చెందిన మానవ బాంబ్ 40 మంది భారతీయ జవాన్లను పొట్టన పెట్టుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రతి ఒక్కరూ మండి పడుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ దుర్మార్గంపై తీవ్రంగానే దుమ్మెత్తి పోస్తున్నారు.
టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఇప్పటికే సానుభూతి వ్యక్తం అవ్వడమే గాకుండా విరాళాలు వెల్లువెత్తాయి. అమర జవాన్ల కుటుంబాల్ని ఆదుకునేందుకు మేము సైతం అంటూ పలువురు టాప్ స్టార్లు ముందుకు వచ్చారు. టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ, తమిళ హీరో విజయ్ వంటి స్టార్లు ఇప్పటికే స్పందించారు. ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మరోవైపు టాలీవుడ్ నుంచి విరాళాల వెల్లువ మొదలైంది. పుల్వామా బార్డర్ ఘటనలో అమరవీరులైన జావాన్ల కుటుంబాలకు టాలీవుడ్ నుంచి ప్రగాఢ సానుభూతి వ్యక్తమవుతోంది. ఆ మేరకు ఓ ప్రకటనలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షులు శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ.. జవాన్లపై జరిగిన ఘటనను ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మా అసోసియేషన్ తరపున రూ.5లక్షలు సాయాన్ని అందజేస్తున్నామని తెలిపారు. మరోవైపు బాలీవుడ్ హీరోలు ఈ ఘటనపై స్పందించి తమవంతు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో పాల్గొంటున్న స్టార్ హీరో.. దేశభక్తి పరుడైన అక్షయ్ కుమార్ స్పాట్ నుంచి రూ.5కోట్లు అమర జవాన్ల కుటుంబాలకు అందిస్తున్నానని, ఆ మేరకు ఆ మొత్తాన్ని ప్రధానమంత్రి కి చెందిన పీఎంవోకి పంపిస్తున్నట్టు ప్రకటించారు. దేశభక్తి సినిమాలకు ప్రాధాన్యతనిచ్చే మరో హీరో అజయ్ దేవగన్ సైతం వెంటనే స్పందించారు. ఆయన టోటల్ ధమాల్ టీమ్ తరపున రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నామని తెలిపారు. బిగ్ బి అమితాబ్ సహా, సల్మాన్ ఖాన్ 2.5cr సైతం సైనికుల ఆర్థిక సాయం గురించి అభ్యర్థించారు. తాము కూడా సహాయం అందిస్తున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇక పలువురు కథానాయికలు, హీరోలు సైతం సైనికుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటించడం విశేషం.