దిల్‌రాజ్ కు టెన్షన్ టెన్షన్

టాలీవుడ్లో సినిమాలు చేయటం మానేసి రాజకీయాలతో బిజి అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఇప్పటికీ ఆతని రేంజ్ ఆతనిదే దానిని చేరుకోవటం మరో హీరోకు ఇప్పటికీప్పుడు సాధ్యం కాదనే చెప్పాలి. అప్పుడెప్పుడో ఎన్నికలకు ముందు సినిమాలకు టాటా చెప్పేసి వెళ్లిపోయిన పవన్ మళ్లీ ముఖానికి రంగేసుకోవటానికి రావడానికి సిద్ధపడుతు ‘పింక్’ సినిమా రీమేక్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వినిపించగా… నిర్మాతగా దిల్‌రాజు ఈ సినిమా కి కొబ్బరికాయ కొట్టి మరీ షూటింగ్‌ని షురూ చేసాడు. ప్రస్తుతం పవన్ లేకుండా ఉండే పలు సీన్లను తెరకెక్కిస్తున్నారు కూడా.
నిజానికి గత ఎన్నికల సమయంలో దిల్ రాజు కు ఓ సినిమా చేస్తానని చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడన్న కథలు చాలానే ఫిలింనగర్లో నడిచాయి. ఎన్నికథలు వినిపించినా తన ఎనర్జీకి తగ్గట్టు లేక పోవటంతో చివరికి పింక్ సినిమాని తెలుగుదనం నింపడంతో ఈ రీమేక్‌కు ఒప్పుకున్నాడట.
అయితే తాజాగా ఏపిలో మారుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ-జనసేన రెండు పార్టీలు కలిసి ముందుకెళ్లాలని నిర్ణయానికి రావడంతో రాజకీయాల్లో మరింత బిజిబిజీగా గడిపే ఆస్కారం ఉండటంతో ఇచ్చిన డేట్లకి పవన్ వచ్చి షూటింగ్లో పాల్గొంటాడా? అన్న నమ్మకం దిల్‌రాజులో సన్నగిల్లుతోందట. అసలు సినిమా అవుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నాడట ఆయన. పవన్ నమ్మి సినిమాకు సిద్దమై బొక్కబోర్లా తను పడతానేమోనన్న ఆందోళన సన్నిహితుల వద్ద చెప్పుకొస్తున్నాడు, మరి దిల్ రాజు టెన్షన్ దించేలా పవన్ దించుతాడో లేదో తెలియాలంటే పండుగ అయిపోయేంతవరకూ వేచి చూడాల్సిందే.