మిస్మ్యాచ్ సక్సస్ మీట్

ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా ‘డాక్టర్ సలీమ్’ వంటి విజయవంతమైన చిత్రాన్నిరూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ బేనర్ పై జి.శ్రీరామ్రాజు, భరత్ రామ్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ మ్యాచ్’. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6న విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ భారీగా సాధించుకుంటోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీరామరాజు మాట్లాడుతూ –‘మా బేనర్ లో తొలి సినిమానే. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించడం ఆనదంగా ఉందని, ప్రేక్షకులు థియేటర్లో సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారన్నారు. ఉదయ్, ఐశ్వర్య తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అని చెప్పారు.
దర్శకుడు నిర్మల్ కుమార్ మాట్లాడుతూ చిన్నసినిమాకి ఇంతటి స్పందన ని ఊహించలేదు. నా మొదటి సినిమాను ఆదరించినట్టే, రెండవ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కి పెద్ద థ్యాంక్స్, ప్రేక్షకుల ఆదరణ, మద్దతు ఉంటే చిన్న చిత్రమైనా ఎంత మంచి విజయం సాధిస్తుందో నిరూపణ అయ్యిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో ఉదయ్ శంకర్, సంగీత దర్శకుడు గిఫ్టన్, నటులు శరణ్య,సంధ్య, వెంకటరామారావు, శ్రీరామ్బాలాజీ, కెమెరామెన్ గణేష్ తదితరులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. సమావేశం అనంతరం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్.