చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి గుర్తించిన కరోనా వైరస్..

ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా మారి.. అన్ని చోట్లకు వేగంగా పాకుతుండటంతో ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 9 మంది ఈ వైరస్ సోకి దాని కారణంగా తమ ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 440 మందికి వైరస్ సోకినట్టు చైనా ప్రకటించింది. కొత్తగా పుట్టుకొచ్చిన ‘కరోనా’ వైరస్‌ జనాల శ్వాసవ్యవస్థపై పంజా విసిరి ప్రాణాలను హరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ భారత్ లోని కేరళకు చెందిన ఓ నర్సుకు ఈ వైరస్ సోకిందని వార్తలు వస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. దాంతో దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.. చైనా, హాంగ్‌‌‌‌‌కాంగ్ నుంచి వచ్చే ప్రయాణీకులను పరీక్షించడానికి ప్రత్యేక స్కానర్లను ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1) ఎప్పటికప్పుడు చేతులను సబ్బులతో శుభ్రంగా కడుక్కోవాలి, చేతులను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు
2) దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్‌కు చూపించుకోండి. పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోండి


Leave a Reply

Your email address will not be published.