ఆయ‌న‌కు ‘ఉత్తమ కామాంధుడు’ పురస్కారం ఇవ్వండితమిళ సినీ నేప‌థ్య గాయ‌కుడు వైరముత్తును  తమిళ భాషకు ఆయన చేసిన సేవను గౌరవిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్.. వైరముత్తును సత్కరించనున్నట్లు  కేంద్ర ప్రభుత్వం చేసిన ప్ర‌క‌ట‌న‌పై  సింగర్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో స్పందించింది. గ‌తంలో తనను లైంగికంగా వైరముత్తు వేధించాడని ఒకానొక సందర్భంలో సంచలన ఆరోపణలు చేసిన చిన్మ‌యి ఒకరు కాదు ఇద్దరు కాదు తొమ్మిది మంది మహిళల చేత ఆరోపణలు ఎదుర్కొన్న వైరాముత్తును రక్షణ శాఖ మంత్రి గౌరవ డిగ్రీతో సత్కరించడమేం ట‌ని నిల‌దీసింది. తమిళ భాష పట్ల  వైరముత్తుకు  ఉన్న పట్టును గుర్తించి డాక్టరేట్ ఇస్తున్నారు సంతోషమే కానీ.. అదే విధంగా ‘ఉత్తమ కామాంధుడు’ అనే పురస్కారం కూడా కేంద్రం ఇస్తుందని త‌ను ఆశిస్తున్నట్టు  చిన్నయి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేసింది.  లైంగిక ఆరోపణలు చేసిన బాధితులపైనే సినీ ఇండస్ట్రీ క‌క్ష‌సాధింపుల‌కు దిగుతోంద‌ని, ఎవర్నుంచి సపోర్టు రాకపోవడం.. తనకూ అవకాశాలు లేకుండా చేయడం వెనుక  ఇలాంటి కామాంధులే ఉన్నార‌ని ఆమె ఆరోపించింది. ఇక్క‌డ వాళ్ల‌కి శిక్ష‌లు ప‌డ‌క పోవ‌చ్చు, పైనున్న ఆ భగవంతుడే వారిని శిక్షిస్తాడని చిన్మయి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.