ఫిలిం చాంబ‌ర్ ఎదుట ‘నానిగాడు’ ఆత్మ‌హ‌త్యా య‌త్నం

క‌ట‌ష్ట‌ప‌డి తాము రూపొందించిన ‘నానిగాడు’ సినిమా యూట్యూబ్‌లో లీక్ అవ్వడంపై తీవ్రంగా ఆందోళ‌న వ్య‌క్తంచేస్తూ  ‘నానిగాడు’ చిత్రబృందం మంగళవారం ఫిలిం చాంబర్ ముందు ఆందోళనకు దిగింది.  అయిన‌ప్ప‌టికీ ఫిలిం చాంబ‌ర్ నుంచి ఎటువంటి స్పంద‌న లేక‌పోవ‌టంతో నిర్మాత‌ల మండ‌లి త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన  హీరో దుర్గా ప్రసాద్ బుధ‌వారం ఆత్మహత్య ప్ర‌య‌త్నానికి పాల్పడ్డాడు. 
40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమాకు సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చిందని.. త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటుంటే.. యూట్యూబ్‌లో సినిమా రిలీజ్ కావడంపై  ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ, వెంటనే లింకులు తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో న‌ష్టం చ‌విచూడాల్సివ‌స్తోంద‌ని  కలత చెందిన దుర్గా ప్రసాద్.. ఫిలిం చాంబర్ ముందు పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. ఈ విష‌యం గ‌మ‌నించిన కొంద‌రు అప్రమత్తమై  ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. ప్ర‌స్తుతం ఆత‌ని ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు స‌మాచారం. కాగా ఈ విష‌య‌మై అటు ఫిలిం చాంబ‌ర్ నుంచి కానీ, ఇటు మా నుంచి కానీ స్పందించేందుకు ఎవ్వ‌రూ అందుబాటులో లేక‌పోవ‌టం విచిత్రం.

Leave a Reply

Your email address will not be published.