శుక్ర‌వారం గుడికా? కోర్టుకా? దేనికి వెళ్లాలి


ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌లా అంతా కోర్టుల వెంట తిర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.  చివ‌ర‌కి గుడికి వెళ్తున్న అమరావతి మహిళలను కూడా పోలీసుల‌తో అడ్డుకోవడాన్ని ట్విట్టర్ వేదికగా చంద్ర‌బాబు తప్పుబట్టారు.  రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు గ‌ర్హ‌నీయ‌మ‌ని, జ‌గ‌న్ ప‌రివారం ఆదేశాల‌తోనే ఇష్టానుసారం  ఆ విషయాన్నే చెబుతూ ‘శుక్రవారం గుడికి వెళ్ళకపోతే మీలాగా కోర్టుకు వెళ్ళమంటారా?’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

కాగా శుక్రవారం ఉదయం తుళ్లూరు, మందడంతో పాటూ రాజధాని గ్రామాల మహిళలు, రైతులు ర్యాలీగా విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు  బ‌య‌లుదేరారు.  అయితే   మార్గ‌ మధ్యంలో   పోలీసులు ముళ్ల కంచెలు వేసి వీరంద‌రినీ అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు పోలీసులు  కొంతమంది రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ విష‌య‌మై పోలీసుల‌కు రైతులకు మధ్య తీవ్ర‌ వాగ్వాదం జ‌రిగింది.  దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు త‌మ లాఠీ ల‌కు ప‌నిచెప్పారు.  ఈ లాఠీచార్జ్‌లో పలువురు మహిళా రైతులకు తీవ్రంగా దెబ్బ‌లు త‌గిలాయి.  కింద ప‌డిపోయిన‌ మహిళలను ఈడ్చుకు వెళ్లి వ్యాన్ల‌లో ఎత్తి ప‌డేయ‌టం  వివాదంగా మారింది. గ్రామ దేవతలని పూజించుకోడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతులు గుడికి వెళ్తుంటే దౌర్జన్యంగా అరెస్టు చేస్తారా? ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కులు ఉన్నాయా?’ అని ప్రశ్నించారు.


Leave a Reply

Your email address will not be published.