పెళ్ళికి బాజా మోగింది…కుమారి శ్రీమతి కానుంది…?
ఇదిలా ఉంటే… కియారా ఇంట్లో పెళ్ళి భాజా మోగనుందట…? ఏంటి కియారాకి పెళ్ళా అనుకుంటున్నారా…? కొంపదీసి ఆమె గాని పెళ్లి చేసుకోవడం లేదు కదా అంటూ ఆమె అభిమనులు తెగ ఇదైపోతున్నారు. ప్రస్తుతం గుడ్ న్యూస్ ప్రమోషన్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న కియారా అద్వానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగడం అంటే…. కియారా అద్వానీ సిస్టర్ పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్నీ గుడ్ న్యూస్ ప్రమోషన్స్ లో కియారా అద్వానీ స్వయంగా తన సిస్టర్ మ్యారేజ్ అని.. ఆమెకి శుభాకాంక్షలు కూడా తెలిపింది. నా సోదరితో పాటు ఆమెకు కాబోయే భర్త ఇద్దరు ఆనందంగా ఉండాలని కోరకుంటున్నానంది.
అది విన్న కియారా అద్వానీ హార్డ్ కొర్ అభిమానులు ఊపిరి తీసుకున్నారు. మీడియాలో కియారా ఇంట్లో పెళ్లి భాజాలు అనగానే ఒకింత కంగారు పడిన ఆమె ఫ్యాన్స్ ఇపుడు ఊపిరి పీల్చు కుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కియారా అద్వానీ కెరీర్ సాగుతుంది. సినిమాల మీద సినిమాలు చేస్తూ హాట్ అండ్ గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్స్ గా మారిన కియారా ఇప్పుడప్పుడే పెళ్లి మాటలు ఎత్తదులే. అయితే ఆమె నటించిన వెబ్ సిరీస్‌తో కూడా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.