చంద్రబాబు సహా ఎమ్మెల్యేల అరెస్ట్

రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన తదుపరి దీనిని నిరసిస్తూ టీడీపీ ఆందోళన కి దిగింది. మరోవైపు మందడంలో రైతులపై ఠీచార్జీ చేసిన పోలీసులు తమ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్‌పైనా, మాజీ మంత్రి దేవినేని ఉమపైనా కర్కశంగా వ్యవహరించి, వారిపై దాడి చేసారని, ఈ దాడిలో గాయపడ్డ జయదేవ్‌కు కనీస వైద్యం కూడా అందకుండా చేసారని టీడీపీ ఆరోపించింది.
ఈ క్రమంలోనే మందడం వరకు తన శాసనసభ్యులతో ర్యాలీగా వెళ్లాలని బయల్దేరిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తో పాటు వెంట ఉన్న ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమను ఎందుకు అరెస్ట్ చేశారంటూ నిలదీసిన చంద్రబాబుకు వారు సహేతుకమైన సమాధానం ఇవ్వక పోవటంతో వారితో కాసేపు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.