నువ్వు డ్ర‌గ్స్ బాగా తీసుకుంటావా…!

`వెన్నెల‌` చిత్రంతో టాలీవుడ్‌కి ప‌రియ‌మై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరును సంపాదించారు ర‌వివ‌ర్మ‌. ఆ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ర‌వివ‌ర్మ డ్ర‌గ్ అడిక్ట్ పాత్ర‌లో ఒక‌ర‌కంగా చెప్పాలంటే చింపేశాడ‌నే చెప్పాలి అంత బాగా నటించాడు. ఇక ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల్లో సైడ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ అతి త‌క్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించారు. ఇక ఈ చిత్రాన్ని సూప‌ర్‌స్టార్ మ‌హేష్ కూడా చూశార‌ట‌. ఈ విషయాన్ని రవి వర్మ ఓ సందర్భంలో తెలిపారు. ఓ సినిమా షూటింగ్‌లో మహేష్.. రవి వర్మను చూడగానే ఓ ప్రశ్న అడిగారట. అది విని తాను షాకయ్యానని రవి వర్మ అన్నారు.
‘అయితే నువ్వు డ్రగ్స్ బాగా తీసుకుంటావన్నమాట’ అని మహేష్ అన్నారట. దాంతో సెట్స్‌లో ఉన్నవారంతా పగలబడి నవ్వుకున్నారట. 2015లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాలో రవి వర్మ నటించారు. ‘అసుర’, ‘క్షణం’, ‘టెర్రర్’, ‘రాజా చెయ్యి వేస్తే’, ‘సత్య’ టాక్సీడ్రైవ‌ర్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు రవి వర్మ. ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published.