రిపబ్లిక్ డే కానుకగా

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్పి పతాకంపై తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో  బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా  జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్, పోస్టర్లకు చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా ‘మిస్టర్ మజ్ను’ ట్రైలర్ రిలీజైంది. ఈ ప్రచార చిత్రానికి అద్భుత స్పందన వచ్చింది. అక్కినేని బ్రాండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని  ట్రైలర్ చెబుతోంది. ఈ చిత్రంలో అఖిల్ నిధి రొమాన్స్ అక్కినేని అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. థమన్ సంగీతం, పాటలు, రీరికార్డింగ్ ఈ చిత్రాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లాయన్న ప్రశంసలు దక్కాయి. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, కెమెరా: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, కళ: అవినాష్ కొల్లా, డ్యాన్స్: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ కథనం దర్శకత్వం: వెంకీ అట్లూరి.
అందరివాడు..
అఖిల్ తన టీమ్‌తో కలిసి ఎంతో జోవియల్‌గా చిత్రీకరణలో పాల్గొన్నారని చెబుతుంటారు. వ్యక్తిగత సిబ్బంధితో అతడు ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఇటీవలే తన సిబ్బందిలో మోసెస్ అనే యువకుని వివాహానికి అఖిల్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  తూ.గో జిల్లా కడియంలో ఈ వివాహం జరిగింది.

Leave a Reply

Your email address will not be published.