మరోమారు ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  మరోమారు  ఎన్టీఆర్‌తో చేస్తున్న చిత్రానికి  కథానాయికగా పూజాహెగ్డేని ఎంపిక చేసిన‌ట్టు గుస‌గుస వినిపిస్తోంది.  ఇప్ప‌టికే వరుసగా రెండు సినిమాలలో అవకాశం ఇచ్చిన త్రివిక్ర‌మ్‌.. ఇప్పుడు మూడోసారి పూజానే బరిలో దించడంపై ఫిలింన‌గ‌ర్‌లో హాట్ టాపిక్ గా మారింది.

  ఎన్టీఆర్-పూజా హెగ్దే జంటగా  అరవింద సమేత చేసిన త్రివిక్రమ్. బన్నీతో అల వైకుంఠపురములోనూ పూజాకే ఛాన్సిచ్చాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు.. పూజా హెగ్దే వల్లనే అని   సెంటిమెంటు ఫీలవుతు,  తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల్యాండ్ మార్క్ మూవీకి పూజానే రిపీట్ చేయాలని చూస్తున్నాడని ఫిలింగ‌న‌ర్‌లో టాక్‌. 

 ఈ బుట్టబొమ్మ సెంటిమెంట్ అనుకున్నా, మ‌రో పాత్ర కోసం  రష్మిక పేరు కూడా పరిశీలిస్తున్నట్లు టాక్.  అయితే ర‌ష్మిక కూడా హీరోయిన్ అంటూ మ‌రోక‌థ‌నం వినిపిస్తోంది. మ‌రి కొద్ది రోజులు ఆగితే అస‌లు విష‌యం బైట‌కు ఎలానూ వ‌స్తుంది. 

Leave a Reply

Your email address will not be published.