‘పవన్ తేజ్ కొణిదెల’ హీరోగా సిలివర్ స్క్రీన్ కి పరిచయం…



కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో సిలివర్ స్క్రీన్ కి పరిచయం కానున్నాడు. రామ్ చరణ్‌కు తమ్ముడు వరుస అయ్యే ‘పవన్ తేజ్ కొణిదెల’ హీరోగా ఓ కొత్త సినిమా తెర మీదకు రాబోతుంది. నూతన దర్శకుడు అభిరామ్ దర్శకత్వంలో పవన్ తేజ్ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత రాజేష్ నాయుడు ఓ సినిమాను రూపొందించ‌బోతున్నారు. ఈ కొత్త సినిమాకు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను రూపొందించింది చిత్రబృందం. ఈ సినిమాలో హీరోయిన్ గా మేఘన నటించనుంది. ‘కొణిదెల’ అనే బ్రాండ్ తో ఇండస్ట్రీలోకి వస్తున్నాడు కాబట్టి పవన్ తేజ్ సినిమా ఆడియన్స్ కు ఈజీగానే దగ్గరయ్యే అవకాశం ఉంది. ‘పవన్ తేజ్’ ఇంతకుముందు చిరంజీవి ‘ఖైదీ నెం.150’, రామ్ చరణ్ రంగస్థలం, వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాల్లో నటించి సినిమాకు కావాల్సిన మెళకువలు నేర్చుకున్నాడు. ఈ కొత్త సినిమాకు కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ‌కూడా విడుదలైంది. కొణిదెల బ్రాండ్‌తో వస్తున్న ఈ కొత్త హీరో తన నటన, డాన్స్ తో మరి ఏమాత్రం తెలుగువారిని ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published.