అనుష్క న‌య‌న్‌ల‌కు ప‌డ‌డం లేదా?

టాలీవుడ్ టాప్ హీరోయిన్లంటే ఒక టైంలో అనుష్క‌, న‌య‌న‌తార‌ల పేరు వినిపించేది. సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్లు అంటే వీరిద్ద‌రే క‌నిపించేవారు. ఇటు సీనియ‌ర్ నుంచి అటు జూనియ‌ర్ వ‌ర‌కు ఎవ్వ‌రితో చేసిన స‌రి జోడి అన్న‌ట్లు ఉంటారు వీరిద్ద‌రు. మూడు పదుల వయసు దాటినా సరే వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. భారీగా పారితోషకం తీసుకుంటూ ఇప్పటికి తమ డిమాండ్ ని కొనసాగిస్తున్నారు. తమిళంలో, తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోలతో వీళ్ళు సినిమాలు చేసారు. స్టార్ హీరోలు అందరికి వీళ్ళు హిట్లు ఇచ్చారు. తమిళం విషయం ఏమో గాని తెలుగులో మాత్రం వాళ్లకు అంటూ,ప్రత్యేక అభిమానులు ఉన్నారు.

హీరోల‌కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వాళ్ళ‌కు మేం త‌క్కువేం కాద‌న్న‌ట్లు వీళ్ళ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. సైజ్ జీరో చిత్రం త‌ర్వాత అనుష్క కాస్త టాలీవుడ్ కి దూరం అయింది. వెయిట్ పెర‌గ‌డంతో అనుష్క కెరియ‌ర్ కాస్త గాడిత‌ప్పింద‌నే చెప్పాలి. వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న న‌య‌న్ కూడా కొంత కాలం టాలీవుడ్‌కి గ్యాప్ ఇచ్చింది. ఇక న‌య‌న్ టాలీవుడ్‌కి దూరం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అనుష్క అనే అంటున్నారు కొంద‌రు.

 ఒక థ్రిల్లర్ కథ విషయంలో అనుష్క ప్రదర్శించిన దూకుడే కారణం అని సమాచారం. కొన్ని రోజులుగా అనుష్క థ్రిల్లర్ సినిమాలు చేస్తుంది. ఆ సినిమా కథ ముందు నయనతార వద్దకు వెళ్ళగా తాను ఒక ప్రాజెక్ట్ లో బిజీ గా ఉన్నాను కొన్ని రోజులు ఆగమని దర్శకుడు తో చెప్పగా ఆ దర్శకుడు తర్వాత అనుష్క కు వినిపించాడట. వెంటనే అనుష్క ఓకే చేసిందట… దీని మధ్య ఇద్దరితో విభేదాలు వచ్చాయని, అప్పటి నుంచి ఆగ్రహంగా ఉన్న నయనతార టాలివుడ్ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మ‌రి ఏది ఏమైన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం అయితే ఇద్ద‌రూ టాలీవుడ్‌కి దూరంగానే ఉన్నార‌ని చెప్పాలి. గ‌త కొంత కాలంగా ఇద్ద‌రికీ సినిమాలు పెద్ద‌గా లేవు. అయితే ఇటీవ‌లె విడుద‌లైన సైరా న‌ర్సింహారెడ్డి చిత్రంలో న‌య‌న్ న‌టించిన‌ప్ప‌టికీ ఆమె పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యత సంత‌రించుకోలేదు.


Leave a Reply

Your email address will not be published.