జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి హీరోయిన్ గా సమంత

జూనియర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్‌ల కాంబినేష‌న్‌లో హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో సమంత ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం అందుతోంది.  ఇప్ప‌టికే ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత హిట్ త‌దుప‌రి రూపొందుతున్న ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో బాగానే అంచ‌నాలు పెరుగుతుండ‌గా… ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా సమంత ఎంపికైన‌ట్టు స‌మాచారం. పెళ్లయిన తర్వాత తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రోమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలింన‌గ‌ర్ టాక్‌. 

కాగా ఈ మూవీకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఎన్టీఆర్ షూటింగ్ కాంప్లీట్ కాగానే ఈ మూవీని పట్టాలెక్కేందుకు త్రివిక్రమ్ సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ చిత్రంలో పూజాహెగ్డేని ఎంపిక చేయ‌గా, ఆమె కాల్షిట్లు ఇబ్బంది కార‌ణంగా వెన‌క్కి త‌గ్గిన‌ట్టు వ‌స్తున్న వార్త‌లు వాస్త‌వం కాద‌ని తెలుస్తోంది. కొంద‌రు ప‌నిలేక ఇలాంటి వార్త‌లు పుట్టిస్తున్నార‌ని, పూజా స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు స‌హ‌క‌రించిన త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌త్వంలో న‌టించేందుకు ఎప్పుడూ సంసిద్ద‌త వ్యక్తం చేస్తూ ఉన్న విష‌యాన్ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం లేని వ్య‌క్తులు అల్లుతున్న క‌థ‌ల‌ని ఫిలింన‌గ‌ర్  వినిపిస్తోంది. ఏది వాస్త‌వ‌మో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
 
  

Leave a Reply

Your email address will not be published.