దిల్‌రాజుకి మళ్ళీ పెళ్లా…

దిల్ సినిమాతో సూపర్ హిట్ నిర్మాతగా పేరు తెచ్చుకుని ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చేసుకున్న‌ దిల్ రాజు టాలీవుడ్‌లో అగ్ర‌నిర్మాత‌ల‌లో ఒక‌డిగా వెలుగొందుతున్నాడు. పంపిణీదారు స్థాయి నుంచి భారీ చిత్రాల నిర్మాత‌గా ఎదిగిన దిల్‌రాజుకు   స్టార్ హీరోలందరి సినిమాలు నిర్మించినఘ‌న‌త ద‌క్కుతుంది.  
తాజాగా దిల్‌రాజు  మళ్ళీ పెళ్లి చేసుకేనేందుకు ర‌డీ అవుతున్నాడంటూ ఫిలింన‌గ‌ర్‌లో ఓ గాసిప్ గుప్పుమంది.  దిల్‌ రాజు భార్య దాదాపు రెండేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే.   ఆత‌ని కుమార్తె సైతం పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు.కూడా. 
ఈ క్ర‌మంలోనే ఒంట‌రిగా ఉంటున్న దిల్ రాజు కు ఒక తోడు కావాలని  కుటుంబ సభ్యులు భావిస్తుండ‌టంతో తన కుటుంబానికి దగ్గర గా ఉన్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడని స‌మాచారం. 
ఈ విష‌యంపై ఇప్ప‌టికే దిల్ రాజు  కుటుంబ స‌భ్యులు సినిమా పరిశ్రమ తో ఎలాంటి సంబంధం లేని, ఆ అమ్మాయి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడార‌ని,  ఇరువురి అంగీకారంతో  పెళ్ళి జ‌ర‌గ‌నుంద‌ని  సమాచారం. అయితే  ఈ గుస‌గుస‌ల‌లోని వాస్తవాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Leave a Reply

Your email address will not be published.