జేమ్స్‌బాండ్ సిరీస్‌

ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ సిరిస్ లో వచ్చే సినిమాలకి ఎంత పాపులారిటీ వుందో అందరికి తెలిసిందే. ఈ సిరిస్ లో వచ్చే సినిమాలని అన్ని దేశాలలో ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తారు. ఇక ప్రాంతీయ భాషలలో కూడా జేమ్స్ బాండ్ సిరిస్ లో వచ్చే సినిమాలు రిలీజ్ అవుతూ వుండాయి. ఇప్పటికే ఈ సిరిస్ లో 24 సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అలాగే సిరిస్ లో ఇప్పటి వరకు ఏడుమంది హీరోలు నటించారు. ప్రస్తుతం డేనియల్ గ్రెగ్ జేమ్స్ బాండ్ హీరోగా కొనసాగుతున్నాడు. ఆ మధ్య కాలంలో జేమ్స్ బాండ్ సినిమాలలో ఇక నటించబోనని చెప్పిన డేనియల్ గ్రెగ్ మరల మనసు మార్చుకొని నటించడానికి అంగీకరించాడు. దీంతో ఈ జేమ్స్ బాండ్ నిర్మాతలు అతనినే హీరోగా ఫిక్స్ చేసి 25వ సినిమాకి రంగం సిద్ధం చేసారు. 
జేమ్స్ బాండ్ సిరిస్ లో 25వ సినిమాకి నిర్మాతలు తాజాగా అఫీషియల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు. 2020 ఏప్రిల్ 8న జేమ్స్ బాండ్ లో కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అని నిర్ధారించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే జేమ్స్ బాండ్ సిరిస్ లో వచ్చిన చివరి చిత్రం ప్రేక్షకులని అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ నేపధ్యంలో ఈ కొత్త చిత్రం కోసం నిర్మాతలు మరింత కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతున్న జేమ్స్ బాండ్ 25 చిత్రం ఎ మేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published.