గోడ మీద వార్తలు

                                                                 

01 . మద్యం సేవించే మహిళల కోసం ప్రత్యేకం గా మహిళా మద్యం దుకాణాలు తెరిచే ఆలోచనలో – మధ్యప్రదేశ్ ప్రభుత్వం …

సలహా ఇచ్చినోడికి సాచికొట్టి పాటించినోడ్ని పాతేసినా తప్పు లేదు – వదిలితే ఇంటింటికీ గొట్టాలేసి సప్లై చేసేట్టున్నారు గదరా సామీ…!!

02. షరతులతో కూడిన అనుమతులిచ్చాక చంద్రబాబుకి సెక్షన్ 151 ప్రకారం నోటీసులెలా ఇచ్చారని పోలీసులని ప్రశ్నించిన – హైకోర్టు …

అసలా రబ్బరు స్టాంపుల్లేని లెటర్లో షన్ద్రబాబు పేరెక్కడుంది అద్యచ్ఛా…?? మాజీలందరికీ మూకుమ్మడిగా అచ్చేసినుత్తరంలా ఉంటే…!!

03. పాక్ – బంగ్లాదేశ్ ల నుండి అక్రమంగా వచ్చిన వారి వివరాలిస్తే 5 వేలు బహుమానం ఇస్తామని ప్రకటించిన – మహారాష్ట్ర నవ నిర్మాణ సేన …

కోర్టులు పోలీసులతో పన్లేదు – ఎవడికాడు పంచాయితీలు మొదలెడితే చాలు సమస్యలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయ్ ..!!

04. డాలరుతో పోల్చుకుంటే ఆరు నెలల కనిష్టానికి పడిపోయిన – రూపాయి విలువ …

భారీగా స్టాక్ మార్కెట్ల పతనం – ఒక్కరోజులో ఐదు లక్షల కోట్ల సంపద ఆవిరి …!!

05. గుడ్లు చెప్పులతో దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి గానీ – చంద్ర బాబుని ఎందుకు ముందస్తు అరెస్టు చేసారని పోలిసులని ప్రశ్నించిన – కోర్టు …

బొంబాయిలో అంతే – బొంబాయిలో అంతే …!!

మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!

“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ”

:||: జై హింద్ :||:

Leave a Reply

Your email address will not be published.