విశాఖ సిగ లో మెట్రో మణిహారం .!

విశాఖ నగరవాసులకు మరో శుభవార్త.  విశాఖపట్నం మెట్రో రైలుకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది, విశాఖపట్నంలో మొత్తం 79.9 కిలోమీటర్లు మెరా మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.  మొత్తం మూడు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది, దీనికోసం కొత్త డి పి ఆర్ రూపకల్పన చేయాలని ఈ మేరకు డి పి ఆర్ ల తయారీ కోసం కొటేషన్లు పిలవాలని అమరావతి మెట్రో రైల్ ఎండి కి ఉత్తర్వులిచ్చింది, గతంలో డి పి ఆర్ రూపకల్పనకు ఎస్సెల్  ఇన్ఫ్రా కన్సార్టియం కు  అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.  విశాఖలో 79.9 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైలు నిర్మాణం కోసం కొత్త డి పి ఆర్ కు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.  మెట్రో తో పాటు గా  మరో 60 కిలోమీటర్లు మోడరన్ కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ఈ క్రమంలో కొత్త రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రో రైలు, రైట్స్, యూఎంటీసీ సంస్థలను సంప్రదించాలని అధికారులను ఆదేశించింది.  మెట్రో డి పి ఆర్ తో పాటు మోడరన్ ట్రామ్ కారిడార్  కు మరో డీపీఆర్ సిద్ధం చేసేందుకు ప్రతిపాదనలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో పాటు మెట్రో కారిడార్ ఏర్పాటు అయితే విశాఖపట్నం మరింత శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది.  

Leave a Reply

Your email address will not be published.