ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను క‌బ్జా చేస్తా…

తెలుగులో ఓం`, `ఎ`, `రా`,లాంటి చిత్రాలతో  మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉపేంద్ర   తాజాగా మ‌రోమారు హీరోగా నటిస్తోన్న సినిమా `కబ్జ`. అండర్ వరల్డ్ డాన్ నేప‌థ్యంలో  యాక్షన్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కే ఈ చిత్రం జ‌నవరి4న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభం అయింది.  ఇదే వేదికపై `కబ్జ` మోషన్ పోస్టర్ ని లగడపాటి శ్రీధర్ లాంచ్ చేశారు.
 లగడపాటి శ్రీధర్ సమర్పణలో ఆర్.చంద్రు దర్శకుడిగా ఆర్.చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్ సంయుక్తంగా  శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ పతాకంపై  నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం పూజాకార్యక్రమాలతో ఆరంభ‌మైంది. అనంతరం ఉపేంద్ర పై చిత్రీకరించిన ముహూర్తుపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ క్లాప్ నివ్వగా, ఆనంద్ గురూజీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహుర్త సన్నివేశనికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.

 అనంతరం ఏర్పాటైన సమావేశంలో  దర్శకుడు ఆర్.చంద్రు మాట్లాడుతూ  మాస్ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో ఉంచుకుని డిఫరెంట్ స్టయిల్ లో పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామ‌ని, ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకుంటామ‌న్న ధీమా త‌న‌కు ంద‌ని అన్నారాయ‌న‌.

 సమర్పకుడు లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ  చంద్రు వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. ఆయనతో క‌ల‌సి చేసిన `కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమా`  జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికై అవార్డు తెచ్చిపెట్టింది. ఈ మ‌ధ్య ఆయ‌న చెప్పిన‌ `కబ్జ` కథవినగానే  వన్ ఆఫ్ ది పార్ట్  కావాల‌నిపించి ర‌డీ అయ్యా.. క‌న్న‌డ‌లో  చంద్రు, ఉపేంద్ర కాంబినేషన్లో వచ్చిన `బ్రహ్మ`, `ఐ లవ్ యు` చిత్రాలకంటే `కబ్జ` పెద్ద హిట్ అవుతుందని న‌మ్మ‌కం ఉంద‌ని అన్నారు. 

ఉపేంద్ర మాట్లాడుతూ.. `ఎ` చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.   `కబ్జ` ఒక అండర్ వరల్డ్ డాన్ కథ అయినా   ప్రేక్షకుల హృదయలను కబ్జా చేస్తుంది..అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో  నిర్మాతలు ఆర్.చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మునేంద్ర కె.పుర, కో-ప్రొడ్యూసర్స్ గోనుగుంట్ల శ్రీనివాస్, ఆర్.రాజశేఖర్, ఆనంద్ గురూజీ, హెచ్ యం, రేవన్న, ఫైట్ మాస్టర్ రవి వర్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.