గోడ మీద వార్తలు

01 . కేంద్ర ప్రభుత్వం తమని ఆదుకోకపోతే సంస్థ ని మూసేయటం తప్ప మరో మార్గం లేదు – వోడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా …
అయ్యో – ఎంతమాట ..?? – ప్రభుత్వాలు ఉన్నదే అందుక్కదూ – పోటా పోటీగా ఆఫర్లతో సంకనాకిపోతే సంకనెక్కించుకోవటమేగా ప్రభుత్వం పని ..!! 
02. ఎవరు ఇష్టమొచ్చినట్టు వాళ్ళు కాల్చుకుంటూ పోతే ఇక చట్టాలూ న్యాయ స్థానాలూ దేనికి…?? – భాజపా నేత మేనకా గాంధీ…
ఎందుకా ..?? టీవీ సీరియల్లలా యుగాలకి యుగాలు కేసులు వాయిదాల పేరుతో సా…….గదీస్తూ బిర్యానీలతో నిందితులని మేపటానికి…!!
03. దిశ కేసు కోర్టులో ఉండగా చట్టాన్ని చేతులోకెలా తీస్కుంటారంటూ ఎన్కౌంటరు పై కోర్టుకెళ్ళిన పలు మహిళా సంఘాలు…
ఆడపిల్లలకి అన్యాయం జరిగినప్పుడు బయట కి రాకుండా యాడ దాక్కున్నాయబ్బా ఈ సంఘాలన్నీ …!!
04. రాష్ట్రంలో రియల్ ఎస్టేటు ధరలు పడి పోవటంతోనే చంద్రబాబు రాజధాని పర్యటన చేసాడు – ఇసుక , ఇంగ్లీష్ అయిపోయాయి – ఇప్పుడు ఉల్లి మీద పడ్డారు – విజయసాయి రెడ్డి …
నీ కోపరేషన్లో నాన్ కోపరేషన్ తగలెయ్య… కవరు సేత్తన్నాననుకుంటా నిజాలు చెప్పి ఇరికిచ్చేత్తన్నావ్ గా సామీ అన్నియ్యని…!!
05. నిర్భయ కేసప్పుడు మా మీద కూడా చాలా ఒత్తిడి ఉండేను – కానీ మేం చట్టాన్ని చేతుల్లోకి తీస్కోలేదు – చట్టప్రకారం కోర్టుకి అప్పచెప్పాం – మాజీ అధికారి …
గత అర్థ పుష్కర కాలం ఆ ఎదవలని మేపటం తప్ప ఏవఁన్నా …కింది ఉందా బాబాయ్ ఆ కేసులో – వాయిదాలకి రానూ పోనూ డీజిల్ ఖర్చులు అదనపు రంధ్రం కాపోతే…!!

Leave a Reply

Your email address will not be published.