రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ ఎవ‌రు?

రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్‌ ప్రారంభం అయ్యి రెండు వారాలు అవ్వబోతుంది. అయినా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ మాత్రం విడుదల చేయలేదు. ముఖ్యంగా హీరోయిన్‌ విషయంలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు సినిమాలోని హీరోయిన్స్‌ విషయంలో రాజమౌళి క్లారిటీ రాలేదు.

రామ్‌ చరణ్‌కు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ ఆలియా భట్‌ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆలియా భట్‌ ఎంపిక విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ రెండవ షెడ్యూల్‌ మొత్తం కూడా హీరోలపైనే చిత్రీకరించే అవకాశం ఉంది. అందుకే ఆలియా భట్‌ విషయం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని, మూడవ షెడ్యూల్‌ ప్రారంభం సమయానికి మిగిలిన మరో హీరోయిన్‌ విషయంలో కూడా రాజమౌళి ఒక ప్రకటన చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు సౌత్‌లో నటించడం చాలా కామన్‌. కాని రాజమౌళి తన ప్రతి సినిమాలో కూడా సౌత్‌ ముద్దుగుమ్మలతోనే పని కానిచేస్తాడు. కాని ఈసారి బాలీవుడ్‌ నుండి తీసుకు రావడం చర్చనీయాంశం అవుతోంది. అందుకే ఈ చిత్రం కోసం చాలా శ్రద్ద తీసుకుని, బాలీవుడ్‌ రేంజ్‌లో ఉండాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఆలియా భట్‌ను ఒక హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. మరో హీరోయిన్‌గా పరిణితి చోప్రాను ఎంపిక చేస్తాడనే టాక్‌ వినిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.